పని చేయడం చేతకాకనే మర మనుషులను కనిపిడితే.. ఆ మర మనుషులు కూడా ‘అలసితిని.. సొలసితిని’ అంటూ నేలకూలిపోతున్నాయి. అవునండీ బాబూ.. రోబోలు కూడా అలసిపోతాయి. మీరు విన్నది నిజంగా నిజం కావాలంటే ఈ వార్త మొత్తం చదివితే అసలు నిజం తెలుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా చాలా కాలం నుంచే అనేక కంపెనీలు, మనుషులు తమ అవసరాల కోసం రోబోట్‌లు, ఎలక్ట్రానిక్ హ్యూమన్‌ల సేవలను వినియోగిస్తూ వస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్నట్లుగా.. వాటి సేవలు కూడా విస్తృతం అయ్యాయి. ఈ ప్రోగ్రామబుల్ మెషీన్‌లను వినియోగించడానికి కారణం.. అవి అధిక సామర్థ్యం కలిగి ఉండటం, అలసిపోకుండా మనుషుల కంటే ఎక్కువ గంటలు పని చేయగలవు కావట్టి. కానీ, ఈ సీన్ చూస్తే మాత్రం అంతా వట్టిదే అంటారు. రోబోలు కూడా అలసిపోతాయని ఈ సీన్ చూసి అర్థం చేసుకోవచ్చు.
రోబో అలసిపోయి, కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్వేయర్ బెల్ట్‌పై రోబోట్ ప్లాస్టిక్ కంటైనర్‌లను పెడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ రోబోట్ గంటల తరబడి పని చేసింది. ఈ క్రమంలోనే కాసేపటి తరువాత ఒక కంటైనర్‌ను ఎత్తుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రోబోట్.
రోబోట్ అలిసిపోయి, పడిపోయిన వీడియోను సోషల మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. రోబోలు కూడా అలసిపోతాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ స్టన్నింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.
Video of a robot collapsing in a scene that seemed to fall from tiredness after a long day’s work… pic.twitter.com/EFw8giecrM
— Videos that will surprise you ? (@moistonig) April 11, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..