AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అరె ఏంట్రా ఇది! నడిరోడ్డుపై లవర్స్ బరితెగింపు.. పబ్లిక్‌గా హాగ్‌లు, ముద్దులు.. సీన్ కట్ చేస్తే!

ఇదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా ఇటీవల కొంతమంది లవర్స్ పబ్లిక్‌గా రెచ్చిపోతున్నారు. హద్దుమీరు ముద్దులు, అసభ్యకరమైన చేష్టలతో..

Viral: అరె ఏంట్రా ఇది! నడిరోడ్డుపై లవర్స్ బరితెగింపు.. పబ్లిక్‌గా హాగ్‌లు, ముద్దులు.. సీన్ కట్ చేస్తే!
Viral Video
Ravi Kiran
|

Updated on: Feb 09, 2023 | 9:45 AM

Share

ఇదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా ఇటీవల కొంతమంది లవర్స్ పబ్లిక్‌గా రెచ్చిపోతున్నారు. హద్దుమీరు ముద్దులు, అసభ్యకరమైన చేష్టలతో నడ్డిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛతీస్‌గడ్ లాంటి ప్రాంతాల్లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే మరొకటి రాజస్థాన్‌లో వెలుగు చూసింది.

అజ్మీర్‌లోని రీజనల్ కాలేజీ క్రాస్ రోడ్స్‌లో ఓ ప్రేమ జంట నడ్డిరోడ్డుపై స్పీడు‌గా బైక్‌పై దూసుకుపోతూ.. రొమాన్స్ చేస్తూ.. కెమెరాలకు చిక్కారు. ఈ ఘటన సోమవారం రాత్రి వేళలో చోటు చేసుకోగా.. అటుగా వెళ్తున్న వాహనదారులు వారిని వీడియో తీశారు. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌పై అమ్మాయిని అసభ్యకర రీతిలో కూర్చోబెట్టుకుని బైక్‌‌పై రయ్.. రయ్‌మంటూ వేగంగా దూసుకుపోతున్నాడు. ఇక ఆ యువతి.. యువకుడిని హాగ్ చేసుకుని, ముద్దు పెట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.. పోలీసులకు ట్యాగ్ చేసి ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై స్పందించిన అజ్మీర్ పోలీసులు.. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా బైక్ నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సదరు వ్యక్తిని సాహిల్‌గా గుర్తించామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.