కొండచిలువలను చూస్తే చాలా భయం కలుగుతుంది. భారీ సైజులో అవి కదులుతూ ఉంటే చూసేవారికి ఒళ్లు జలదరిస్తుంది. ఇక దానికి ఆకలి వేసిందంటే దాని కంటపడిన ఏ జీవినీ వదిలి పెట్టదు. అమాంతం మింగేస్తుంది. అలాగే వాటితో స్నేహం చేస్తే మాత్రం అవి కూడా అంతే స్నేహంగా ఉంటాయి. అలాంటి కొండచిలువలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. నీటి అడుగున డైవింగ్ చేస్తుండగా అతనికి ఓ పెద్ద కొండచిలువు ఎదురైంది. అంతే దాన్ని చూడగానే అతని పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ చివరిలో సూపర్ ట్విస్ట్ ఇచ్చింది ఆ కొండచిలువ.
ఈ వీడియోలో ఓ వ్యక్తి సముద్రం అడుగున డైవింగ్ చేస్తున్నాడు. నీటి అడుగు భాగంలోని అందమైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఎదురుగా ఓ పెద్ద కొండచిలువ ఆహారం వెతుక్కుంటూ అటుగా వెళ్తుంది. దాన్ని చూడగానే భయంతో వణికిపోయాడు సదరు వ్యక్తి. అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఆ భారీ కొండచిలువకు ఎదురెళ్లాడు. కొండచిలువ కూడా అతన్ని మింగేసేలా దగ్గరికి వెళ్తుంది. అతను తన చేతిలోని కెమెరాను పాము ముఖంపై దగ్గరగా పెట్టి వీడియో తీసాడు. అలా దాని ఎదురుగా చాలాసేపు ధైర్యంగా ఉన్నాడు. కొండచిలువకు అతని ధైర్యం నచ్చినట్టుంది. తన మనసు మార్చుకుని, అతడిని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! చాలా భయానకంగా ఉంది’’.. అని కొందరంటే ‘‘అతడి టైం చాలా బాగుంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Diver encounters an absolutely gigantic anaconda in a brazil? pic.twitter.com/IeSqA2A7yO
— Oops That’s Deadly (@thatsinsane__) April 26, 2023