Viral: నీ టెక్నిక్‌కు దండంరా సామీ.. బుసలు కొడుతూ మీదకొచ్చిన కింగ్ కోబ్రా.. ఎలా పట్టాడో చూస్తే మైండ్ బ్లాంకే!

|

Sep 15, 2022 | 7:02 PM

ప్రపంచవ్యాప్తంగా పాముల్లో 3,900 జాతులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ప్రమాదకరం కానప్పటికీ.. మరికొన్ని విషపూరితం.

Viral: నీ టెక్నిక్‌కు దండంరా సామీ.. బుసలు కొడుతూ మీదకొచ్చిన కింగ్ కోబ్రా.. ఎలా పట్టాడో చూస్తే మైండ్ బ్లాంకే!
Follow us on

ప్రపంచవ్యాప్తంగా పాముల్లో 3,900 జాతులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ప్రమాదకరం కానప్పటికీ.. మరికొన్ని విషపూరితం. ఈ లిస్టులో మొదటిగా కింగ్ కోబ్రా గురించి చెప్పుకోవాలి. అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రా.. చాలా పొడవు ఉంటుంది. ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో కనిపించే ఈ కింగ్ కోబ్రా.. అప్పుడప్పుడూ భారతదేశం కనిపించిన సందర్భాలు లేకపోలేదు. దీని కాటుతో మనిషి క్షణాల్లో మరణిస్తాడు. భారీ జంతువునైనా కింగ్ కోబ్రా కాటు చంపేస్తుంది. అలాంటి డేంజరస్ పామును ఓ స్నేక్ క్యాచర్ తెలివిగా పట్టుకుని బంధించాడు. ఇది కాస్త పాత వీడియో అయినప్పటికీ మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

కర్ణాటకలోని చిక్‌మగళూరు‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ఓ ఇంటి వెనుక గోడ వద్ద ఉన్న సిమెంట్ రేకుల వెనుక 10 అడుగుల కింగ్ కోబ్రా నక్కింది. గ్రామస్తులు ఆ పామును చూసి.. స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్ అర్జున్.. ఆ భారీ సైజ్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. దాని తోక పట్టుకున్న ప్రతీసారి అది.. అతడిపైకి బుసలు కొడుతూ దూసుకొచ్చింది. అయినా కూడా అర్జున్ ఎక్కడా బెదరకుండా పామును పట్టుకున్నాడు. ఓ ప్లాస్టిక్ పైప్‌ చుట్టూ కవర్‌ను చుట్టి.. దాని గుండా అది వెళ్ళేలా చేశాడు. చివరికి 10 అడుగుల పామును తెలివైన టెక్నిక్‌తో బంధించాడు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.