AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మేడమీద ముద్దులాట.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన తల్లి.. నా సామిరంగ సీన్ అద్దిరిపోయింది..

కుర్రకారుకు ప్రేమపిచ్చి.. తల్లిదండ్రులకు వారి భద్రతపై భయం.. వెరసి ఇద్దరి మధ్య దాగుడుమూతలాడ నడవటం ఖాయం. ప్రేమలో పడని వారు ఎవరుంటారు చెప్పండి.

Watch Video: మేడమీద ముద్దులాట.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన తల్లి.. నా సామిరంగ సీన్ అద్దిరిపోయింది..
Lovers Caught
Shiva Prajapati
|

Updated on: Feb 17, 2023 | 5:00 PM

Share

కుర్రకారుకు ప్రేమపిచ్చి.. తల్లిదండ్రులకు వారి భద్రతపై భయం.. వెరసి ఇద్దరి మధ్య దాగుడుమూతలాడ నడవటం ఖాయం. ప్రేమలో పడని వారు ఎవరుంటారు చెప్పండి. యుక్త వయస్సులో యువతీ, యువకులు ప్రేమలో పడటం సాధారణం. ఇప్పుడున్న పెద్దలు కూడా.. తన యవ్వనంలో ఎవరితోనో ప్రేమలో పడే ఉంటారు. అది వన్‌సైడ్ లవ్ అయినా, టూ సైడ్ లవ్ అయినా తప్పక ఉండే ఉంటుంది. ఈ ప్రేమలో పడిన వ్యక్తుల విరహవేదన అంతా ఇంతా కాదు. ఒకరినొకరు విడిచి దూరంగా ఉండలేరు. మాట్లాడకుండా అస్సలు ఉండలేరు. ఒక్క రోజు చూడకపోయినా.. ప్రాణాలే పోయినంతగా ఫీల్ అవుతుంటారు కొందరు ప్రేమికులు. అందుకే.. దొంగచాటుగానైనా తమ భాగస్వామిని కలవాలని భావిస్తారు. భావించడమే కాదు.. కలుస్తుంటారు కూడా. అలా మీట్ అవ్వడంలో వచ్చే కిక్కే వేరప్పా అనే కూడా అంటారు ప్రేమికులు.

అయితే, ఈ దొంగచాటు ప్రేమాయణాలు అన్నివేళలా వర్కౌట్ అవ్వవని కూడా తెలుసుకోవాలి. గోడలకు చెవులు, కళ్లు రెండూ ఉండాటాయండోయ్. అవి మీ రహస్య ప్రేమను బహిర్గతం చేసేస్తాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన జంట..

సాధారణంగానే తమ పిల్లలు వేరే వారితో ప్రేమలో ఉంటే తల్లిదండ్రులు అస్సలు యాక్సెప్ట్ చేయ్యరు. అలాంటిది తమ ఇంటికొచ్చి, తమ కూతురుతో రొమాన్స్ చేస్తుంటే ఊరుకుంటారా? దెబ్బకు దెయ్య వదలాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రేమ జంట.. ఇంటి టెర్రస్‌పై రొమాన్ చేస్తోంది. ఇంతలో బట్టలు ఆరేసేందుకు మేడ మీదకు వచ్చింది అమ్మాయి వాళ్ల అమ్మ. అమ్మాయి పైన ఉండటాన్ని గమనించింది. ఎంటి? ఇక్కడున్నావ్ అంటూ ప్రశ్నించింది. సమాధానం చెప్పలేక తత్తరపడింది. ఇంతలో మరోవైపు నుంచి శబ్ధాలు రావడంతో ఆ తల్లికి అనుమానం వచ్చేసింది. ఇంకేముంది.. అటూ ఇటూ కలియతిరుగుతూ వెతికింది.

చివరికి ఆమె అనుమానం నిజమైంది. గుట్టుగా దాక్కున్న కుర్రాడిని కనిపెట్టింది. ఇంకేముంది.. ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అబ్బాయి గల్లా పట్టుకుని, చెప్పుతొ కొట్టడం స్టార్ట్ చేసింది. ఆ దెబ్బల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన యువకుడు.. చివరకు ఎలాగోలా అక్కడి నుంచి జంప్ అయ్యాడు. అతను అలా వెళ్లగానే.. అమ్మ కోపం అమ్మాయిపై మళ్లింది. తన బిడ్డను జుట్టు పట్టుకుని, చెప్పుతో చెడామడా కొట్టేసింది.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @kadaipaneeeer పేరుతో ఉన్న అకౌంట్‌లో షేర్ చేయగా.. అది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాండ్స్ వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోపై ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..