దారి వెంట చిన్న పాము పోతేనే హడలిపోతాం. అలాంటిది మనం ప్రయాణించే వాహనంలో పాము దూరితే? అది కూడా భారీ కొండచిలువ దూరితే? ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే పోతాయి. అలాంటి పరిస్థితే ఓ రైతుకు ఎదురైంది. అయితే, నిత్యం అడవీ జీవులతో సహజీవనం సాగించే రైతుకు ఆ పాము పెద్ద ప్రమాదంగా కనిపించలేదు. పైగా దానితో చెలిమి చేశాడు. దానిని సరదాగా కారులో తీసుకెళ్లి అడవీ ప్రాంతంలో వదిలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన రైతు కారులో ప్రయాణిస్తుండగా ఒక కొండ చిలువ దూరింది. ఆ పామును చూసి అతను భయపడలేదు. పైగా దానితో ముచ్చటించాడు కూడా. ‘కొంచెం నిదానంగా ఉండు. ఎలాంటి పిచ్చి పనులు చేయకు’ అంటూ పాముకు సూచించాడు. అలా తన పాటికి తాను డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. మరోవైపు పాము నెమ్మదిగా డ్యా్ష్‌బోర్డ్ పైకి వచ్చింది. అటూ ఇటూ తిరిగింది. కాసేపటి తరువాత రైతు తన కారును నిర్మానుష్య ప్రాంతంలో నిలిపాడు. ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలాడు. దాంతో ఆ పాము సైలెంట్‌గా తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. ఈ స్టన్నింగ్ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..