Watch Video: ఇదేం కక్కుర్తి భయ్యా.. ఖరీదైన రెస్టారెంట్‌లో పరాఠా స్కామ్‌ చూశారా..? వీడియో వైరల్‌

ఓ వ్యక్తి ఆకలిగా ఉందని రెస్టారెంట్‌కి వెళ్లాడు. అయితే సదరు రెస్టారెంట్‌ బాగా ఖరీదైనదట. అతడు రూ. 200లతో ఓ పరాఠా ఆర్డర్‌ చేశాడు. ఇక సర్వస్‌ వచ్చి ఓ పరాఠాను నాలుగు ముక్కలు చేసి ప్లేట్‌లో తీసుకువచ్చి ఇచ్చి వెళ్లాడు. పరాఠాను నాలుగు ముక్కలుగా కట్ చేసి, చూడటానికి బాగా కనిపించడానికి ప్లేట్లో చక్కగా..

Watch Video: ఇదేం కక్కుర్తి భయ్యా.. ఖరీదైన రెస్టారెంట్‌లో పరాఠా స్కామ్‌ చూశారా..? వీడియో వైరల్‌
Paratha Scam At Gurugram Restaurant

Updated on: Dec 26, 2025 | 9:37 PM

ఓ వ్యక్తి హర్యానాలోని గురుగ్రామ్‌లోని ది బైకర్స్ బార్న్‌ అనే రెస్టారెంట్‌కి వెళ్లాడు. అయితే సదరు రెస్టారెంట్‌ బాగా ఖరీదైనదట. అతడు రూ. 200లతో ఓ పరాఠా ఆర్డర్‌ చేశాడు. ఇక సర్వస్‌ వచ్చి ఓ పరాఠాను నాలుగు ముక్కలు చేసి ప్లేట్‌లో తీసుకువచ్చి ఇచ్చి వెళ్లాడు. పరాఠాను నాలుగు ముక్కలుగా కట్ చేసి, చూడటానికి బాగా కనిపించడానికి ప్లేట్లో చక్కగా పేర్చి ఇచ్చారు. పరాఠాతోపాటు చట్నీ, ఓ చిన్న వెన్న ముక్కను కూడా ఇచ్చారు. అయితే అతని స్నేహితుడు పైన పరాఠాపై వెన్న పూయడానికి ముక్కలన్నింటినీ వృత్తాకారంలో అమర్చడంతో అసలు గుట్టు బయటపడింది. రూ.200 వచ్చిందే ఒకేఒక్క పరాఠా అయితే.. అందులో దీర్ఘచతురస్రాకారంలో ఓ ముక్క మాయం చేసింది సదరు రెస్టారెంట్‌. ఈ విషయం వారికి అర్ధం అయిన తర్వాత 1×3 ఇంచ్ కా పరాథా గయాబ్ హై అంటూ తలలు బాదుకున్నారు. ఆ రెస్టారెంట్ చేస్తున్న మోసాన్ని వీడియో తీసి @thebikersbarn అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు 7 మిలియన్లకుపైగా వీక్షణలు రావడంతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో ఫన్నీ కామెంట్లు పెడుతూ హల్‌చల్ చేస్తున్నారు. ‘మిగతా ముక్క ఎవరు తిన్నారు?’, ‘1×3 అంగుళాల పరాఠా ముక్క కొట్టేశారు భయ్యా. ఇది ఎంత మోసం’, ‘వారు దానిని వడ్డించే ముందు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు’, పై చార్ట్ పరాంత’, ‘రూ. 200 పరాఠా అక్షరాలా ఒక స్కామ్’.. అంటూ పలువురు నెటిజన్లు రెస్టారెంట్‌ చేస్తున్న మోసాన్ని చమత్కారంగా కామెంట్ల రూపంలో వెల్లడించారు. మరికొందరు ‘ఇది స్కామ్ కాదు. ఇది ఒక పజిల్. మీరు దీన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ’ జోకులు పేల్చుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో పోస్టు చేసిన యూజర్‌ దీనిపై స్పందిస్తూ.. ఇది కేవలం వినోదం, హాస్యం కోసం మాత్రమే కాదు. రెస్టారెంట్‌ వల్ల ఏ విధంగా మోసపోయామని చెప్పడం కూడా కాదు. నాకు ఈ రెస్టారెంట్‌తో ఏదైనా సమస్య ఉంటే నేను నేరుగా రెస్టారెంట్‌ మేనేజర్‌ వద్దకు వెళ్లి ఈ వీడియో చూపించి.. ఈ విషయంపై ఫిర్యాదు చేసేవాడని. కానీ నా ఉద్యేశ్యం అది కాదు. ఈ రెస్టారెంట్‌లో ఫుడ్‌ నిజంగా చాలా రుచిగా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు ఈ రెస్టారెంట్‌కు వచ్చాను. ఆహారం చాలా బాగుంది. కానీ ఈ వీడియో జనాల్ని గందరగోళానికి గురిచేసే అవకాశం ఉంది. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. సరదా కోసం మాత్రమే ఈ వీడియో పోస్టు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పోస్టు చేయడం వెనక ఉద్దేశ్యం ఏమైఉన్నప్పటికీ.. ఖరీదైన రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వచ్చే కస్టమర్లకు యాజన్యం నిజాయితీగా ఆహారం అందించాలి. లేదంటే ఇదిగో ఇలాగే నవ్వులపాలు అవ్వాల్సి వస్తుంది

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.