మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఆడ కుక్క మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో రెండు సరిగ్గా పిల్లి పిల్లల్లా ఉన్నాయి. వాటిని చూసిన వారు ఎవరూ కుక్కపిల్లలు అని అనలేరు. ఈ కుక్కపిల్లలను చూసేందుకు గ్రామంలో జనం పోటెత్తారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
విషయం గోవింద్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతి తోలాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఆడ కుక్క ఇటీవల మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. మూడు కుక్కపిల్లల్లో రెండు పిల్లి పిల్లల్లా కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోయారు. కుక్క అనుకోకుండా పిల్లి పిల్లలను ఎక్కడి నుంచో ఎత్తుకు తెచ్చి ఉంటుందని మొదట్లో అనుకున్నారు. అయితే ఆడ కుక్క వాటిని సంరక్షిస్తున్న తీరు.. ఆ ముగ్గురూ తన కుక్క పిల్లలే అని అందరికి అనిపిస్తుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కుక్కపిల్లల వాయిస్ కూడా పిల్లి పిల్లలను పోలి ఉంటుంది. రాంపాల్ పటేల్ పెంపుడు కుక్క ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి కుక్కలాంటి పిల్ల. అందులో ఇద్దరు పిల్లలు సరిగ్గా పిల్లి పిల్లల్లా ఉన్నారు. వాటి కదలికలు, శబ్దాలు అన్నీ పిల్లుల లాగా ఉంటాయి. కుక్కలా ఉన్న ఆ చిన్న కుక్క పిల్ల కళ్లు ఇంకా తెరవలేదు. కాగా పిల్లిలా కనిపించే చిన్న కుక్క పిల్లల కళ్లు తెరుచుకున్నాయి. తల్లి కూడా ముగ్గురు పిల్లలను సమానంగా ప్రేమిస్తుంది. వాటిని సమానంగా చూసుకుంటుంది.
ఆడ కుక్క తన మూడు కుక్క పిల్లలను ప్రేమగా నోటిలో కరిచి పట్టుకుంటుంది. మూడింటికి కలిపి తన పాలిస్తుంది. తన పిల్లల దగ్గరకు ఎవరినీ రానివ్వడం లేదు. ఎవరైనా ఆ కుక్క పిల్లలని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై దాడి చేయడానికి పరిగెత్తుతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు గ్రామ ప్రజలు క్యూలు కడుతున్నారు. పిల్లిలాంటి కుక్క పిలల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కుక్క పిల్లి పిల్లకు ఎలా జన్మనిస్తుంది అనేది ప్రజల మదిలో ఉన్న ఏకైక ప్రశ్న. దీన్ని స్వయంగా వెటర్నరీ డాక్టర్లు కూడా నమ్మడం లేదు. వాటిని చూసి.. పరిశీలించిన తర్వాతే ఏదైనా చెప్పగలమని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..