ఓర్నీ యేషాలో.! కల్లు, విస్కీతో మంగళ స్నానాలు.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

పెళ్లి అంటే నూరేళ్ల పంట. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన వేడుక. ఆలాంటి పెళ్లి వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. అదిరిపోయేలా జరుపుకుంటారు. రెండు మనసులను కలిపి వందేళ్ల జీవితానికి వేదికగా నిలిచే పెళ్లి వేడుకను విచిత్రంగా జరుపుకుంటున్నారు ఈ కాలం యువత. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా..

ఓర్నీ యేషాలో.! కల్లు, విస్కీతో మంగళ స్నానాలు.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
Viral Video
Follow us
M Revan Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2024 | 1:26 PM

పెళ్లి అంటే నూరేళ్ల పంట. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన వేడుక. ఆలాంటి పెళ్లి వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. అదిరిపోయేలా జరుపుకుంటారు. రెండు మనసులను కలిపి వందేళ్ల జీవితానికి వేదికగా నిలిచే పెళ్లి వేడుకను విచిత్రంగా జరుపుకుంటున్నారు ఈ కాలం యువత. పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డ్స్‌ను వెరైటీగా ప్రింట్ చేయించడం, పెళ్లి బారాత్‌లో వధూవరులు డాన్సులు చేయడం చేస్తుంటారు. మరికొందరు మంగళ స్నానాలు, రిసెప్షన్‌లను గొప్పగా ఆడంబరంగా నిర్వహిస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం హల్దీ ఫంక్షన్(మంగళ స్నానాలు)ను వెరైటీగా జరుపుకున్నాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నరేందర్‌కు.. వలిగొండకు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. నరేందర్ తన పెళ్లి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నాడు. వివాహ వేడుకలో మంగళస్నానం అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు. సాధారణంగా మంగళస్నానం పసుపు నీటితో చేస్తారు. వరుడి మంగళస్నానానికి(హల్దీ ఫంక్షన్)కు గులాబీ పూలు, రంగురంగుల ఫ్లవర్స్, డెకరేషన్స్‌తో అదిరిపోయేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు నరేందర్‌కు గులాబీ రేకులు కలిపిన పసుపు నీటిని జల్లెడతో చల్లారు.

మద్యం, కల్లుతో మంగళ స్నానం..

కానీ వరుడి(నరేందర్) మిత్రులు అక్కడికి చేరుకొని హంగామా చేశారు. కల్లు, బీరు, విస్కీ బాటిల్స్‌తో వినూత్నంగా వరుడిపై పోసి నానా సందడి చేశారు. ఈ హల్దీ ఫంక్షన్‌లో వరుడు మిత్రులు మద్యం బాటిల్స్‌తో డ్యాన్సులు, విన్యాసాలు చేశారు. ఈ తతంగం చేస్తున్న వరుడి మిత్రులను చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్ చేశారు. వేదమంత్రాలతో రెండు కుటుంబాలను రెండు మనసులను ఏకం చేస్తూ నూరేళ్ల జీవితానికి వేదికయ్యే ఈ పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తుండడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..