Watch: వీళ్ల భక్తి సల్లగుండా..! గుడిలో లీకవుతున్న ఏసీ నీళ్లను ప్రసాదం అంటూ ఇలా..

ఇందుకు సంబంధించి దేవాలయం అధికారులు కనీసం నోటీసు అయినా అతికించి ప్రజలను హెచ్చరించాలని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. గుడ్డి భక్తిలో మునిగితేలుతున్న ప్రజలకు వాస్తవాలను ఎవరు వివరిస్తారని మరొకరు రాశారు. ఏసీ వాటర్ టేస్ట్

Watch: వీళ్ల భక్తి సల్లగుండా..! గుడిలో లీకవుతున్న ఏసీ నీళ్లను ప్రసాదం అంటూ ఇలా..
People Are Drinking Ac Water
Follow us

|

Updated on: Nov 04, 2024 | 6:58 PM

బాంకే బిహారీ దేవాలయం… ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్ పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం రాధా, కృష్ణులు కొలువైన మందిరం. మథురలోని బాంకే బిహారీ ఆలయాన్ని ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయంలో రద్దీ కారణంగా చాలా సార్లు తొక్కిసలాట జరిగింది. కాగా, ఈ ఆలయానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అవుతోంది. వీడియోలో ఏసీ నుంచి వచ్చే నీటిని భక్తులు ప్రసాదంగా భావించి తాగుతున్నారు. వీడియో చూసిన నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి.

బాంకే బిహారీ దేవాలయం వెనుక ఉన్న ఓ ప్రదేశంలో నీరు బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గుడి గోడలపై నిర్మించిన తొండం ఎత్తిన ఏనుగు తల ఆకారంలోంచి ఈ నీరు బయటకు వస్తోంది. దీంతో స్వామివారి చరణామృతం, ప్రసాదం అని భావించి భక్తులు ఆ నీటిని పట్టుకుని తాగుతున్నారు.. ఇది ప్రసాదం కాదని, ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీలోని నీళ్లని ఓ వ్యక్తి చెబుతున్నాడు. కానీ, ఎవరూ అతని మాటలు పట్టించుకోవటం లేదు.. ప్రసాదంగా భావించి భక్తులు సేవిస్తున్నారు. తొలుత ఒక భక్తుడు ఇలా చేశాడని, మరికొందరు కూడా ప్రసాదంగా భావించి తాగడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇందుకు సంబంధించి దేవాలయం అధికారులు కనీసం నోటీసు అయినా అతికించి ప్రజలను హెచ్చరించాలని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. గుడ్డి భక్తిలో మునిగితేలుతున్న ప్రజలకు వాస్తవాలను ఎవరు వివరిస్తారని మరొకరు రాశారు. ఏసీ వాటర్ టేస్ట్ వేరు, వారికి ఎందుకు తెలియడం లేదని మరోక యూజర్ రాశారు. ఏసీ నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..