AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుర్చీ కోసం కొట్లాట.. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు.. అసలు ఏం జరిగింది..

ఇద్దరు వ్యక్తులు కుర్చీ కోసం కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ ఘటన బీహార్‎లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది...

Viral Video: కుర్చీ కోసం కొట్లాట.. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు.. అసలు ఏం జరిగింది..
Fight
Srinivas Chekkilla
|

Updated on: Oct 15, 2021 | 7:09 PM

Share

ఇద్దరు వ్యక్తులు కుర్చీ కోసం కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ ఘటన బీహార్‎లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది. బుధవారం జిల్లాలోని మోతిహరి పట్టణంలోని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయంలో ఇద్దరు కొట్టుకున్నారు. ఆదాపూర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్‌ పోస్టు కోసం శివశంకర్‌గిరి అనే వ్యక్తి, రింకీ కుమారి అనే మహిళా ఉపాధ్యాయురాలు మూడు నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్టుకు సీనియరిటీ పరంగా, విద్యార్హతల పరంగా నేనంటే నేను బెటర్‌ అంటూ ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. దీంతో జిల్లా విద్యాశాఖ జోక్యం చేసుకొని వీరిద్దరి విద్యార్హతలు తెలిపే ధ్రువపత్రాలను మూడు రోజుల్లో కార్యాలయంలో అందజేయాలని ఆదేశించింది.

విద్యా శాఖ అడిగినట్లు పత్రాలను సమర్పించడానికి వారు విద్యా శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఎవరు ముందుగా ఆ పత్రాలను సమర్పించాలనే విషయంలో విద్యాశాఖ కార్యాలయంలోనే వారి మధ్య గొడవ జరిగింది. శివశంకర్‎గిరి, రింకి కుమారి భర్త.. ఎవరు ఎక్కువ సీనియర్, పాఠశాల ప్రిన్సిపాల్‌గా కుర్చీ తీసుకోవడానికి అర్హులు అనే విషయంలో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహానికి గురైన రింకీ కుమారి భర్త మరో శివశంకర్‎గిరి తలను గట్టిగా పట్టుకున్నాడు. గిరి అతడి నుంచి విడిపించుకొనే ప్రయత్నంలో కింద పడిపోయారు. ఈ ఘటనను అక్కడే కొంత మంది వీడియో తీశారు. ఆ వీడియోను ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు.

Read Also.. Amala Paul: ఇంత అందమైతే ఎలా అమ్మ అంటూ కామెంట్స్ సొంతం చేసుకుంటున్న ‘అమలాపాల్’ న్యూ ఫొటోస్…

Follow Us