Viral Video: ఉవ్వెత్తున ఎగసి పడుతూ అంబరాన్ని తాకుతున్న అలలు .. అందమైన దృశ్యం.. నెట్టింట్లో వీడియో వైరల్

Viral Video: కొన్ని కొన్ని వీడియోలు ఎన్ని సార్లు చూసినా అద్భుతంగా.. ఆశ్చర్యంగా ఉంటాయి. దీంతో అటువంటి వంటి వీడియోలను సోషల్ మీడియాలో(Social Media) మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తూ ఉంటారు..

Viral Video: ఉవ్వెత్తున ఎగసి పడుతూ అంబరాన్ని తాకుతున్న అలలు .. అందమైన దృశ్యం.. నెట్టింట్లో వీడియో వైరల్
Viral Video
Follow us

|

Updated on: May 05, 2022 | 1:58 PM

Viral Video: కొన్ని కొన్ని వీడియోలు ఎన్ని సార్లు చూసినా అద్భుతంగా.. ఆశ్చర్యంగా ఉంటాయి. దీంతో అటువంటి వంటి వీడియోలను సోషల్ మీడియాలో(Social Media) మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని వీడియోలు ప్రకృతిలో వింతలను కనుల ముందుకు తీసుకొస్తూ.. ఇది నిజమేనా అనిపించేలా ఉంటాయి.. నమ్మడం కష్టంగా అనిపిస్తాయి. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి అద్భుతమైన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత నెటిజన్లు ఆలోచనలో కూడా పడడం సర్వ సాధారణం. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో.. సముద్రంలో ఎగిసిపడే అలలు మేఘాలను ఢీకొన్నట్లు కనిపిస్తాయి. ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఉలిక్కిపడ్డారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ట్విటర్‌లో Buitengebieden అనే ఖాతాతో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు 15 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

వైరల్‌గా మారిన ఈ వీడియో కేవలం 37 సెకన్లు మాత్రమ ఉంది. అయితే దీన్ని చూసిన వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. సముద్ర కెరటాలు భారీగా ఎగసిపడుతున్న దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. కను రెప్ప పాటులో ఈ భారీ అలలు మేఘాలను తాకినట్లు కనిపిస్తాయి.  కెరటాలు అంబరాన్ని చుంభించినట్లు అనిపిస్తుంది. ఈ వీడియో నిజమే కానీ.. మేఘాలు మాత్రం కాదట. మేఘాలను సృష్టించారు. సముద్ర కెరటం.. ఆకాశాన్ని అందుకున్నట్లు కనిపించిన సమయంలో అత్యంత అద్భుతంగా కెమెరాలో బంధించినట్లు తెలుస్తోంది. అత్యంత సహజమైన ఈ సంఘటనలో అలలు మేఘాలను తాకుతున్నట్లు కనిపిస్తున్నా.. అవి మేఘాలుకాదు.. ఏరోసోల్స్.

వైరల్ వీడియో:

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడిది కాదు.. పాత వీడియో. దీనిని మళ్ళీ  @buitengebieden అనే ట్విట్టర్ లో షేర్ చేశారు. అలలు మేఘాలను తాకడానికి సంబరంగా ఎగురుతున్నట్లు.. సముద్రపు అల మేఘాలను తాకగానే ఒక రకమైన పొగ వస్తుంది. అంటే, అలలు నిజంగా మేఘాలను తాకాయి. అయితే వీటిని మేఘాలు అనరు.. ఏరోసోల్స్ అని అంటారు. అవి మైక్రోస్కోపిక్ ఘన కణాలు లేదా ద్రవ బిందువుల రూపంలో గాలిలో ఉంటాయి. మీరు వీటిని ఎక్కువగా సముద్రం పైన , కొండల చుట్టూ చూడవచ్చు. మేఘాల మాదిరిగానే ఉంటాయి. ఈ వీడియోలో కూడా అలలు ఏరోసోల్స్‌తో ఢీకొన్నట్లు కనిపిస్తాయి, మేఘాలు కాదు. ఆ వీడియోలో సముద్రపు ఏరోసోల్ సృష్టించారు. మేఘాలను సృష్టించారని అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. సముద్రంలో బబుల్స్ ఆకారంలో పునర్ సృష్టి చేశారు. దీని అలలు మేఘాలను తాకుతున్నట్లు కనిపిస్తూ కనువిందు చేస్తోంది. చాలా మంది ఈ దృశ్యాన్ని నమ్మశక్యం కానిదిగా అభివర్ణించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: 

Sita Navami 2022: భార్యాభర్తల మధ్య వివాదాలా.. సీతానవమిని పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే

ఏడుపదుల వయసులోనూ బామ్మగారు ఉత్సాహంగా నృత్యం.. చూపరులకు సంతోషం