Viral Video: శ్రీలంక ఎయిర్‌లైన్స్ రామాయణం నేపథ్య ప్రకటనను చూశారా.. గూస్‌బంప్స్ రావడం ఖాయం..

|

Nov 13, 2024 | 6:15 PM

బ్రిటిష్ ఎయిర్ లైన్స్ వారు భారతీయులను ఆకట్టుకునేందుకు ఇచ్చిన ప్రకటన నేటికీ ఆదరణ పొందుతూనే ఉంది. ఇప్పుడు అదే బాటలో మన పొరుగు దేశమైన శ్రీలంక ఎయిర్‌లైన్స్ నడుస్తోంది. తాజాగా భారతీయులను ఆకట్టుకునేందుకు మాత్రమే కాదు.. రామాయణానికి శ్రీలంక కు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసే విధంగా 'రామాయణం' నేపథ్య ప్రకటనను రూపొందించింది. ఈ 5 నిమిషాల ప్రకటనలో రామాయణానికి సంబంధించిన ప్రదేశాలను సజీవంగా ప్రదర్శించారు

Viral Video: శ్రీలంక ఎయిర్‌లైన్స్ రామాయణం నేపథ్య ప్రకటనను చూశారా.. గూస్‌బంప్స్ రావడం ఖాయం..
Sri Lankan Airlines Ad
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కి సంబంధించిన ఒక ప్రకటన బాగా ప్రాచుర్యం పొందింది. విశేషమేమిటంటే హిందువు ఆరాధ్య దైవం శ్రీరాముడు.. రామాయణంతో దీనికి ప్రత్యేక అనుబంధం ఉంది. రామాయణం ఇతివృత్తంతో చిత్రీకరించిన ఈ ప్రకటన ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ యాడ్ విపరీతంగా ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో శ్రీలంకలోని చారిత్రక, పౌరాణిక ప్రదేశాలను ప్రదర్శించి భారతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

విమానయాన సంస్థ తన ప్రకటనల ద్వారా రామాయణానికి సంబంధించిన ప్రదేశాలను సజీవంగా ప్రదర్శించింది. ఇందులో రాముడు, రావణుడు, హనుమంతునికి సంబంధించిన కథలు చిత్రీకరించబడ్డాయి. ప్రకటన ద్వారా మతపరమైన, సాంస్కృతిక ప్రదేశాలను మాత్రమే కాదు ఆ దేశంలో అందమైన ప్రదేశాలను చూపిస్తూ శ్రీలంక పర్యాటక రంగాన్ని కూడా ప్రదర్శించబడింది.

ఇవి కూడా చదవండి

అమ్మమ్మ, మనవడు రామాయణం కథ ఆధారంగా క్షేత్ర పర్యటనలను చేస్తున్న సమయంలో వారి మధ్య చోటు చేసుకున్న సంభాషణతో ప్రకటన ప్రారంభమవుతుంది. రామాయణంలోని పాత్రలు, సంఘటనలతో లోతుగా అనుసంధానించబడిన భారతీయుల మనసుని హత్తుకుంది. భావోద్వేగ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ స్థలాలు నిజంగా ఉన్నాయా అని మనవడు తన అమ్మమ్మను అడిగినప్పుడు, అమ్మమ్మ అవును అని సమాధానం ఇస్తుంది. దీని తరువాత శ్రీలంకలో ఉన్న పౌరాణిక ప్రదేశాల ప్రత్యక్ష వర్ణన వీడియోలో చూపించారు.

ఈ వీడియోలో రామసేతు, రావణుడి గుహ, ఔషధ మూలికలకు ప్రసిద్ధి చెందిన రుమసాల కొండ వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రకటన విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రామాయణ ప్రదేశాల వర్ణనను ప్రశంసిస్తూ చాలా మంది భారతీయులు శ్రీలంకను సందర్శించాలనే కోరికను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

శ్రీలంక ఎయిర్‌లైన్స్ ప్రకటన వీడియోను ఇక్కడ చూడండి

ఒక నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ తాను టోక్యోకు వెళ్లాలని ఆలోచిస్తున్నాను.. అయితే ఈ ప్రకటన చూసిన తర్వాత తాను శ్రీలంకకు వెళ్లాలనిపించేలా చేసింది అని కామెంట్ చేశారు. ఈ చారిత్రక ప్రదేశాలను సంరక్షించినందుకు మరొకరు శ్రీలంకకు ధన్యవాదాలు తెలిపారు. మరొకరు ఈ ప్రకటన తనకు గూస్‌బంప్‌లను ఇచ్చింది. ఇప్పుడు నా విదేశీ పర్యటన జాబితాలో శ్రీలంక కూడా చేరింది అని పేర్కొన్నాడు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..