Taj Mahal Viral Video: తాజ్‌మహల్ నిర్మాణం ఇలాగే జరిగిందా? కండ్లు బైర్లు కమ్మే వీడియో..!
తాజ్‌మహల్ నిర్మాణం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదో AI దృశ్య రూపంలో తీసుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటైన తాజ్‌మహల్‌ను పూర్తి చేయడానికి దాదాపు 22 సంవత్సరాలు కాలం పట్టింది. దీని కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించారని చరిత్ర చెబుతోంది.
మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు.. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందాడు. ఆ క్రమంలోనే ఇటీవల AI టెక్నాలజీ కూడా వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలువబడే ఈ టెక్నాలజీకి మనిషి మెల్లగా అలవాటు పడుతున్నాడు. ఇప్పటికే చాలా చోట్ల AI హవా ఎంతగా వ్యాపించిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచం మానవుడి అరచేతిలో ఉంది. ఈ క్రమంలోనే తాజ్‌మహల్ నిర్మాణం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదో AI దృశ్య రూపంలో తీసుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజ్‌మహల్ అంటే పవిత్ర ప్రేమకు చిహ్నం అని భావిస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ను కళ్లారా చూడాలని, చూసి తరించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆ పాలరాతి కట్టడం అందాన్ని చూస్తూ అలా ఉండిపోవాలని మైమరిచిపోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఎన్నో ఏళ్ల కింద నిర్మించబడిన తాజ్‌మహల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా భారతీయ సంస్కృతికి నిలువుటద్దంలా పేరు తెచ్చుకుందంటే అందులో అతిశయోక్తి లేదు. మరి అంతటి గొప్ప వైభవం ఉన్న తాజ్‌మహల్ నిర్మాణం వెనక ఎంతటి కళా నైపుణ్యం, ఎంత గొప్ప మేథస్సు, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా.. ఇలాంటి భావాల నుంచి పుట్టిందే AI దృశ్య ఆలోచన కూడా.. ఇప్పుడు ఉన్న AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్ నిర్మాణానికి సంబంధించిన గుర్తులను మళ్లీ ఒకసారి చూడగలిగితే ఎలా ఉంటుంది? అద్భుతం కదూ..!
వీడియో ఇదిగో:
తాజ్‌మహల్ దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన అందమైన కట్టడం. వాస్తవానికి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటైన తాజ్‌మహల్‌ను పూర్తి చేయడానికి దాదాపు 22 సంవత్సరాలు కాలం పట్టింది. దీని కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించారని చరిత్ర చెబుతోంది. వేలాది మంది కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించిన ఈ కట్టడం నిర్మాణం ఎలా జరిగిందో AI దృశ్య రూపకంగా కేవలం 54 సెకండ్లలో ఓ వీడియో పొందుపరిచారు. ఇది చూస్తుంటే నిజంగానే తాజ్‌మహల్ నిర్మాణం వెనక ఇంత కష్టం దాగి ఉందా అని మనం ఆశ్చర్యపోక తప్పదు. ఏనుగుల సాయంతో నిర్మాణానికి సామాగ్రిని చేర్చడం, పెద్ద పెద్ద పాలరాతి బండలను అవసరమైన రీతిలో డిజైన్ చేయడం, అందమైన ఆకృతులను, కళారూపాలను తీర్చిదిద్దడం, దాని వెనక కార్మికుల నిరంతర శ్రమ… ఇదంతా కళ్లకు కట్టినట్లుగా చూపించింది ఈ వీడియో. విజువల్‌గా చూస్తుంటేనే ఇంత బాగుంది.. మరి నిజంగా ఆ సమయంలో మనం అక్కడ ఉండి ఉంటే ఒక గొప్ప కళాఖండం కళ్ల ముందే రూపుదిద్దుకోవడం చూసేవాళ్లమని అందరీకి అనిపిస్తూ ఉంటుంది.