Viral Video: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై దొర్లుతున్న బాబా.. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని విన్నపం..

| Edited By: Janardhan Veluru

Sep 14, 2022 | 4:25 PM

బాబా వేషంలో అతడు దెబ్బ తిన్న రోడ్లపై పడుకుని పోర్లు దండాలు పెడుతున్నట్టుగా పోర్లాడు... కమిటీ సభ్యుడు నిత్యానంద..

Viral Video: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై దొర్లుతున్న బాబా.. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని విన్నపం..
Innovative Protest
Follow us on

Viral Video: కర్ణాటకలో కురిసిన భారీ అక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. కుండపోత వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. గుంతలు పడ్డ రోడ్లపై రోడ్లపై ప్రయాణించడానికి వాహనదారులు, ప్రయాణికులు జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఉడిపిలో వర్షం కారణంగా దెబ్బ తిన్న రోడ్లను బాగు చేయాలని ఓ సామాజిక కార్యకర్త వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంతకీ వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం…

రోడ్ల పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఉడిపిలో ఒక సామాజిక కార్యకర్త బాబా వేషంకట్టాడు. బాబా వేషంలో అతడు దెబ్బ తిన్న రోడ్లపై పడుకుని పోర్లు దండాలు పెడుతున్నట్టుగా పోర్లాడు… కమిటీ సభ్యుడు నిత్యానంద ఒలకడు రోడ్ల దయనీయ పరిస్థితిని మీడియా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఇలా వెరైటీ నిరసనకు దిగాడు. ఇదంతా వీడియో తీసిన స్థానికులు కమిటీ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధిచిన వీడియోను మనోష్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు. పోస్టుతో పాటు #ఉడిపిలో ఒక సామాజిక కార్యకర్త రోడ్ల దయనీయ పరిస్థితిని ఎత్తిచూపేందుకు గుంతలపై పడుకున్నాడు. ఉడిపి సివిక్ కమిటీ సభ్యుడు నిత్యానంద ఒలకడు కాషాయ వస్త్రం ధరించి ఈ పని చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇంద్రాలి రైల్వే బ్రిడ్జి సమీపంలోని రోడ్లపై గుంతులు ఏర్పడ్డాయి. రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియోకు  15 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 9 వందల మంది రీట్వీట్లు చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైన కళ్లు తెరిచి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ఓ నెటిజన్లు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి