Viral News: విండో సీటు రాలేదని ఎయిర్‏లైన్‏కు కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ ఆనర్స్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..

అలాగే ఓ వ్యక్తి కూడా విమానంలో విండో సీటు కోసం ఎక్కువ డబ్బు పెట్టి బుక్ చేసుకున్నాడు. తీరా అతడికి నార్మల్ సీటు కేటాయించారు సిబ్బంది. అదే విషయాన్ని అతను సదరు కంపెనీకి ట్విట్ చేయగా..

Viral News: విండో సీటు రాలేదని ఎయిర్‏లైన్‏కు కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ ఆనర్స్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..
Viral News
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2022 | 1:10 PM

సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు విండో సీటు కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే సమయంలో విండో సీటు కోసం ఎక్కువ డబ్బులిచ్చి మరీ రిజర్వేషన్ చేసుకుంటారు. రైళ్లు, బస్, విమానాల్లో దూరం ప్రయాణాలు చేసేవారికి విండో సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అయితే ఎక్కువ డబ్బు పెట్టి విండో సీట్ బుక్ చేసిన తర్వాత కూడా ఆ సీట్ రాకపోతే కోపం వస్తుంది కదా. ముఖ్యంగా ప్రయాణం చేయడానికి పూర్తిగా సిద్ధమై.. రైలు, విమానం ఎక్కిన తర్వాత విండో సీటు బుక్ చేసుకుంటే నార్మల్ ఏరియాలో మనకు సీటు కేటాయిస్తే కోపం కట్టలు తెంచుకుంటుంది. సహనం కోల్పోయి అక్కడున్న సిబ్బందిపై అరిచేస్తుంటారు. అలాగే ఓ వ్యక్తి కూడా విమానంలో విండో సీటు కోసం ఎక్కువ డబ్బు పెట్టి బుక్ చేసుకున్నాడు. తీరా అతడికి నార్మల్ సీటు కేటాయించారు సిబ్బంది. అదే విషయాన్ని అతను సదరు కంపెనీకి ట్విట్ చేయగా.. వాళ్లు ఇచ్చిన ఆన్సర్ చూసి షాకయ్యాడు. దీంతో సదరు కంపెనీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

@MartaVerse అనే ట్విట్టర్ వినియోగదారుడు తన సోషల్ మీడియా ఖాతాలో తాను బుక్ చేసుకున్న సీటు ఫోటోను షేర్ చేస్తూ.. తాను విండోసీటు కావాలని అందుకు తగిన నగదు చెల్లించానని.. కానీ విండోసీటు ఇవ్వకుండా డోర్ దగ్గర సీటు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 10న ఆ వ్యక్తి ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అయ్యింది. ఇది గమనించిన సదరు ఎయిర్ లైన్ కంపెనీ స్పందిస్తూ.. అతని ట్వీట్‍ను రీట్వీట్ చేస్తూ.. అతని సీటు పక్కనే ఉన్న చిన్న రంధ్రాన్ని రౌండప్ చేసి.. అదే విండో సీటు అన్నట్లుగా రియాక్ట్ అయ్యారు. దీంతో సదరు ఎయిర్ లైన్ కంపెనీ పనితీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు తీసుకుని విండోసీటు ఇవ్వకుండా తప్పించుకున్నారని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు తమకు ఎదురైన విషయాలను పోస్ట్ చేస్తున్నారు. అందులో చాలా మందికి విండో సీటు కాదు.. చిన్న రంధ్రం ఉన్న ప్రదేశంలో సీటు రాలేదంటూ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ