పాములతో మాములు పరేషాన్ కాదు… ఎప్పుడు.. ఎక్కడ నక్కి కాటు వేస్తాయో తెలీదు. ప్రజంట్ అసలే రెయినీ సీజన్. అవి ఆవాసాలను కోల్పోయి.. జనావాసాల్లోకి చేరుతాయి. అందుకే ఈ సమయంలో జనాలు ఎక్కువగా పాము కాట్లకు గురవుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే పాములు బైక్స్, కార్లు, షూస్‌లో కూడా దూరతాయి. అందుకే కాస్త అప్రమత్తత అవసరం. ఇలాంటి సందర్భాలకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఓ మహిళ నిద్రపోతుండగా.. ఓ సన్నని పాము పాకుతూ వచ్చి ఆ జుట్టులోకి దూరంది.
మహిళ ఘాడ నిద్రలో ఉండగా.. పాము మెల్లగా పాకుతూ జుట్టులో మెలికలు వేసుకుంది. తలలో ఏదో పాకుతున్నట్లు అనిపించడంతో.. ఆ మహిళ ఒక్కసారిగా కదిలి.. చేతితో చూసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకుందాం అనుకుంటే వీడియో పూర్తిగా లేదు. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం.. కావాలనే ఈ స్టంట్ చేశారని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకర పాములతో ఇలాంటి ఫీట్స్.. సరికాదని చెబుతున్నారు. ఈ వీడియో ప్రజంట్ తెగ ట్రెండ్ అవుతోంది. “ఆ పాము విషం తీసి కావాలనే ఇలా చేశారు”.. “ఇంత ఓవరాక్షన్ చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది”.. “పామును అలా తలలోకి వదిలి కావాలనే వీడియో తీశారు”.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..