Shocking: ధైర్యముంటేనే ఈ వీడియో చూడండి.. రెప్పపాటులో కారును మింగేసిన టోర్నడో..

Viral Video: కాస్త గట్టిగ గాలి వస్తేనే హడలిపోతాం. ఇక తుపాను వస్తే ఇంట్లో కూర్చుని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఏకంగా టోర్నడో వస్తే.. పరిస్థితి ఊహించలేం. ఇంట్లో ఉన్నా..

Shocking: ధైర్యముంటేనే ఈ వీడియో చూడండి.. రెప్పపాటులో కారును మింగేసిన టోర్నడో..
Tornado

Updated on: Jan 10, 2023 | 1:01 PM

కాస్త గట్టిగ గాలి వస్తేనే హడలిపోతాం. ఇక తుపాను వస్తే ఇంట్లో కూర్చుని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఏకంగా టోర్నడో వస్తే.. పరిస్థితి ఊహించలేం. ఇంట్లో ఉన్నా.. అమాంతం ఇంటిని సైతం ఎత్తుకెళ్లగల శక్తి దానికి ఉంటుంది. తాజాగా భీకరమైన టోర్నడోకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం వీడియోను చూసే నెటిజన్లు హడలిపోతారు. అలాంటి దానిని ఫేస్ చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

టోర్నడోలు మన దేశంలో రాకపోయినప్పటికీ.. అమెరికా వంటి దేశాల్లో ఇవి సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. టోర్నడోల వల్ల ఆస్తి నష్టమే కాదు.. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. తాజాగా టోర్నడో కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే గుండెలదిరిపోవడం ఖాయం.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై కార్లు ప్రయాణిస్తున్నాయి. చిరుజల్లులు కురుస్తున్నాయి. అదే సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చింది మృత్యురూపంలోని టోర్నడో. అలా రోడ్డుపైకి దూసుకొచ్చిన టోర్నడో.. ఓ కారుపై తన ప్రతాపం చూపించింది. అమాంతం ఆ కారును చుట్టేసింది. ఓ భారీ జంతువు మింగేసినట్లుగా.. టోర్నడో ఆ కారును అమాంతం మింగేసింది. దాని తీవ్రతకు కారు చిన్నపాటి కర్రపుల్ల మాదిరిగా ఎగిరిపోయింది. సెకన్ల వ్యవధిలోనే కారు సహా రోడ్డుపై ఉన్న అన్నీ మాయం అయిపోయాయి. ఈ భీకర దృశ్యమంతా వెనుకాలే వస్తున్న మరో కారులోని కెమెరాలో రికార్డ్ అయ్యింది.

కారు కెమెరాలో రికార్డ్ అయిన వీడియోను Vicious Videos పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. అత్యంత భయంకరంగా ఉన్న ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు వణికిపోతున్నారు. వామ్మో టోర్నడో ఇంత డేంజర్‌గా ఉంటుందా? అంటూ భీతిల్లిపోతున్నారు. రెప్పపాటు కాలంలో టోర్నడో ఓ కారును మింగేయడం నిజంగా షాకింగ్ సీన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కారులోని ప్రయాణికుల పరిస్థితి ఏంటో అని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

వైరల్ అవుతున్న భయానకమైన వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..