Viral Video: ఇసుకలో చిప్స్‌తో కప్పుకున్న వ్యక్తి.. పక్షులు సందడే సందడి.. వీడియో వైరల్

|

Oct 28, 2021 | 1:58 PM

Viral Video: సోషల్ మీడియాలో పోస్ట్ చేసే చిలిపి పనులు , సవాళ్లు , విచిత్ర విన్యాసం వీడియోలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటువంటి వారు..

Viral Video: ఇసుకలో చిప్స్‌తో కప్పుకున్న వ్యక్తి.. పక్షులు సందడే సందడి.. వీడియో వైరల్
Viral Video
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో పోస్ట్ చేసే చిలిపి పనులు , సవాళ్లు , విచిత్ర విన్యాసం వీడియోలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటువంటి వారు సెలబ్రెటీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంటూ.. తరచుగా తమ పనులతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిని కామెడీ ద్వయం మార్టీ మరియు మైఖేల్ తరచుగా సాంప్రదాయేతర సామాజిక ప్రయోగాలు, విన్యాసాలు,  కామెడీ స్కిట్స్ తో  ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నెటిజన్లను అలరిస్తుంటారు.  ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఓ వ్యక్తి హాట్ చిప్స్‌లో తనను తాను కవర్ చేసుకున్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ఆప్ లోడ్ చేశారు. ఈ వీడియో ఆస్ట్రేలియాలోని సర్ఫర్స్ ప్యారడైజ్ బీచ్‌లో తీసినట్లు తెలుస్తోంది. హాస్య జంట మార్టీ , మైఖేల్ లు చిప్స్ తో మనిషి కప్పుని ఉంటే పక్షులు వాటిని తినడానికి వస్తాయా లేదా అని చూడాలనుకున్నారు. దీంతో మైఖేల్ చిప్స్ తో తనను తాను మెడ వరకూ కప్పుకుని ఇసుకలో పాతిపెట్టుకున్నాడు. దీంతో అతని చుట్టూ.. సీగల్స్ పక్షులు చుట్టుముట్టాయి.  ఈ  కామెడీ  ద్వయం ఈ ప్రయోగం కోసం పక్షులు వస్తాయో రావో తెలుసుకోవడానికి $1,000 విలువైన చిప్‌లను కొనుగోలు చేశారు.

Also Read:  ఓ యువతి ఆత్మహత్యాయత్నం..ఆన్‌లైన్‌లో పోస్ట్.. సకాలంలో స్పందించిన పోలీసులు..