Viral Video: నవ్విపోదురు గాక నాకేంటి.. విమానాన్ని ఆటోగా మార్చేసిన అంకుల్.. వీడియో వైరల్

|

Aug 24, 2024 | 1:09 PM

కొన్ని రకాల వీడియోలను చూడడం వలన ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే నవ్వును నియంత్రించుకోలేము. ఇలాంటి వీడియో ఇటీవలి కాలంలో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఒక అంకుల్ విమానాన్ని ఆటోగా మార్చేశాడు. గేటు దగ్గర నిలబడి చేతులతో ఖైనీని రుద్దుకోవడం మొదలుపెట్టాడు.

Viral Video: నవ్విపోదురు గాక నాకేంటి.. విమానాన్ని ఆటోగా మార్చేసిన అంకుల్.. వీడియో వైరల్
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాకు భిన్నమైన క్రేజ్ ఉంది. రోజులో ఏ మాత్రం సమయం దొరికినా ఎక్కువ మంది రకరకాల వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. వీటిల్లో కొన్నిటిని చూసి ఆశ్చర్యపోతుంటారు. చాలాసార్లు కొన్ని రకాల వీడియోలను చూడడం వలన ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే నవ్వును నియంత్రించుకోలేము. ఇలాంటి వీడియో ఇటీవలి కాలంలో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఒక అంకుల్ విమానాన్ని ఆటోగా మార్చేశాడు. గేటు దగ్గర నిలబడి చేతులతో ఖైనీని రుద్దుకోవడం మొదలుపెట్టాడు.

ఎవరైనా సరే విమానంలో ప్రయాణించే సమయంలో మంచి దుస్తులు ధరించాలి కొన్ని రకాల పనులు చేయకుండా హుందాగా ఉండాలి అని భావిస్తారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఇటువంటి ఫీలింగ్స్ ఎ మాత్రం ఆ అంకుల్ కు ఉన్నట్లు లేదు.. దీంతో ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారుల మోముపై నవ్వులు పూయిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో రన్‌వేపై ఒక ప్రైవేట్ జెట్ ఉంది. దాని చుట్టూ సిబ్బంది నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో విమానం డోర్ వద్ద ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతను తన రెండు చేతులతో ఖైనీని రుద్దుతున్నాడు. ఇలా ఖైనీని నలిపి చిటికెలో దానిని తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే విషయంలో పూర్తి సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ వీడియో @MehdiShadan అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఆరు లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఇతను ‘దిస్ డౌన్ టు ఎర్త్ మ్యాన్.. ఈరోజు భూమికి దూరంగా ఎగరనున్నాడు అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు అంకుల్ ప్రైవేట్ జెట్‌ను ఆటోగా మార్చాడు’ అని వ్యాఖ్యానించారు. చాలా మంది ఇతర వినియోగదారులు అంకుల్ చేసిన పనిపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..