Watch Video: ఓరీ దేవుడో.. ఏకంగా ఇంట్లోకే దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి

|

Apr 01, 2024 | 2:31 PM

చిరుతలు, పెద్దపులుల, ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి ఐదుగురిపై దాడి చేసింది. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా చిరుత పులి కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Watch Video: ఓరీ దేవుడో.. ఏకంగా ఇంట్లోకే దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి
Leopard Jumps Off Roof
Follow us on

కాంక్రీట్‌ జంగిల్‌ వేగంగా విస్తరిస్తోంది. దాంతో అడవుల విస్తీర్ణం అంతకంతకూ తగ్గిపోయింది. దాంతో అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు, క్రూరమృగాలు జనవాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోకి ప్రవేశించిన అడవి జంతువులు పలుమార్లు ప్రజలపై దాడి చేసిన సంఘటనలు కూడా అనేకం చూశాం. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి దృశ్యాలు, సంఘటనలకు సంబంధిన వీడియోలు తరచూ చూస్తుంటాం. ఇందులో ముఖ్యంగా చిరుతలు, పెద్దపులుల, ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి ఐదుగురిపై దాడి చేసింది. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా చిరుత పులి కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సోమవారం ఉదయం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుత ఇళ్ల కప్పులపై దూకుతూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసింది. ఐదుగురిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుత దాడిలో గాయపడిన వారిని ముందుగా ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీ అగ్నిమాపక దళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే రెండు ఫైర్ ఇంజిన్లను ఢిల్లీలోని వజీరాబాద్‌లోని జగత్‌పూర్‌ గ్రామానికి పంపినట్లు చెప్పారు. స్థానికుల సాయంతో రెస్క్యూ టీం చిరుతను పట్టుకున్నారు. మరోవైపు ఇళ్లపై చిరుత దూకుతూ పరుగులు తీస్తున్న దృశ్యాలను స్థానికులు తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..