Viral Video: వామ్మో.. అసలే కింగ్ కోబ్రా..! తోక పట్టి లాగితే ఊరుకుంటుందా..? వీడియో చూస్తే గుండె ఝల్లుమంది!

అయితే, కింగ్ కోబ్రాస్ అప్పుడప్పుడు ఆహారాన్ని వెతుక్కుంటూ అడవులకు సమీపంలో ఉన్న మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తుంది. ఇళ్ళు లేదా నివాస ప్రాంతాల నుండి కింగ్ కోబ్రాలను రక్షించే అనేక వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఇక్కడ ఒక భారీ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది.

Viral Video: వామ్మో.. అసలే కింగ్ కోబ్రా..! తోక పట్టి లాగితే ఊరుకుంటుందా..? వీడియో చూస్తే గుండె ఝల్లుమంది!
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 04, 2023 | 10:44 AM

అసలే ఇది వర్షాకాలం. దేశవ్యాప్తంగా కుండపోత వానలు కుమ్మరిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. పంట పొలాలు నీటిమునిగి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఊర్లు, వీధులు చెరువుల్లా మారిపోయాయి. కాలనీల్లో వరద ఉధృతి కొనసాగింది. వరద, బురద అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు, బురదతో పాటుగా పాములు, తేళ్లు ఇంకా అనేక క్రిమి కీటకాదులు కూడా వచ్చి చేరుతున్నాయి. ఐతే, ఒక ఇంట్లోకి ప్రవేశించిన భారీ కింగ్‌ కోబ్రా అక్కడి వారిని హడలెత్తించింది. అసలే కింగ్‌ కోబ్రా. ఆపై దాని విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఈ వైరల్‌ వీడియోలో చూడొచ్చు.

కింగ్ కోబ్రా..అత్యంత భయంకరమైన, విషపూరిత పాము. ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి. సాధారణంగా దట్టమైన అడవులలో కనిపిస్తాయి. ఇలాంటి కింగ్‌కోబ్రా ఏకంగా.. 20 మందిని చంపగలదు. ఒక పెద్ద ఏనుగును కూడా చంపేంత శక్తి కింగ్‌కోబ్రాకు ఉంటుంది. కింగ్ కోబ్రాస్ అడవిలో నివసిస్తుంది కాబట్టి, అవి చాలా అరుదుగా మనుషులపై దాడి చేస్తాయి. అయితే, కింగ్ కోబ్రాస్ అప్పుడప్పుడు ఆహారాన్ని వెతుక్కుంటూ అడవులకు సమీపంలో ఉన్న మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తుంది. ఇళ్ళు లేదా నివాస ప్రాంతాల నుండి కింగ్ కోబ్రాలను రక్షించే అనేక వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఇక్కడ ఒక భారీ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో భారీ కింగ్‌ కోబ్రా..ఒక ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అది గమనించిన ఓ వ్యక్తి ఆ పాము తోకను పట్టుకుని బయటకు లాగేందుకు చూశాడు..ముందుగా పామును కర్రతో కొడదామని అనుకుంటాడు. కానీ, చేతిలో కర్రను దూరంగా విసిరేసి.. పాము తోకను చేత్తో పట్టుకుని బయటకు లాగాడు. అంతే..! ఆ తర్వాత జరిగిన సంఘటనతో ఒక్కసారిగా అంతదూరం ఎగిరిపడ్డాడు. ఆ భారీ కింగ్‌కోబ్రా విశ్వరూపం చూసిన ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు. వేగంగా బయటకు వచ్చిన ఆ విష సర్పం.. ఇంత ఎత్తుకు లేచి నిలబడి పూర్తి పడగ విప్పి నిల్చుంది. కింగ్‌కోబ్రా రూపాన్ని చూసిన ఆ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కి 2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. కింగ్ కోబ్రా విశ్వరూపం చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మరికొందరు సరదా కామెంట్స్‌ను పంచుకున్నారు. అయితే, ఈ వీడియోలో ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే విషయంపై సమాచారం లేదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రకాల కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..