Viral News: చీ..చీ ఇదేం పని..! షవర్‌, సింక్, వాషింగ్ మెషీన్ నీళ్లతో బీర్ తయారీ..!! మద్యం ప్రియులు..

ఇది ప్రధానంగా స్నానం చేసిన నీరు, బట్టలు ఉతికిన వాటర్‌, పైకప్పుపై నుంచి పడే వర్షపు నీటిని పట్టుకోవడం, శుద్ధి చేయడం క్రిమిసంహారకం చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ పై తీవ్ర చర్చ మొదలైంది. చాలామంది అలాంటి బీరుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. మరోవైపు, బీర్ తయారీకి పూర్వవైభవం రావడంతో బీర్ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.

Viral News: చీ..చీ ఇదేం పని..! షవర్‌, సింక్, వాషింగ్ మెషీన్ నీళ్లతో బీర్ తయారీ..!! మద్యం ప్రియులు..
Beer From Shower Water
Follow us

|

Updated on: Aug 04, 2023 | 11:34 AM

ఇళ్లలోంచి విడుదలయ్యే డ్రైనేజీటి నీటిని ఉపయోగించి ఒక కంపెనీ బీరును తయారు చేసింది. ఈ బీరు వార్త ఇప్పుడు ఇంటర్‌ నెట్‌ ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తోంది. వాక్‌తూ అదేం బీరు బాబోయ్‌ అంటూ ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ముక్కున వేలేసుకుంటారు. స్నానానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటితో బీరు తయారు చేస్తున్నారని తెలిసి నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు సంస్థ దావా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రీసైకిల్ చేసిన గృహ వ్యర్థ జలాల నుండి తయారు చేసిన ఈ బీరుకు ఎపిక్ వన్ వాటర్ బ్రూ – పిచ్చర్-స్టైల్ బీర్ అని పేరు పెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కో యొక్క 40-అంతస్తుల భవనం ఫిఫ్టీన్ ఫిఫ్టీలో ప్రజలు ఉపయోగించే షవర్లు, సింక్‌లు, వాషింగ్ మెషీన్ల నుండి వదిలేసిన నీటిని రీసైకిల్ చేసిన ఆ సంస్థ.. ఎపిక్ క్లీన్‌టెక్ ఎపిక్ వన్‌వాటర్ బ్రూ-ఒక పిచ్చర్-స్టైల్ బీర్‌ని సృష్టించింది.

ఆ బీర్ ఎలా తయారు చేస్తారు..

కాలిఫోర్నియా కంపెనీ మొదట మురుగునీటిని శుద్ధి చేసి రీసైక్లింగ్‌కు అనువుగా చేస్తుంది. ఆపై ఆ నీటిని తీసుకుని బీరు తయారుచేస్తారు. మిర్రర్ నౌ ఇన్‌స్టాగ్రామ్ పేజీ కొత్త బీర్‌ను ప్రకటించింది. ఒక మహిళ బీర్ తాగుతున్న ఫోటో అక్కడ పోస్ట్‌ చేశారు. నీళ్ల కంటే బీరు తాగడం సురక్షితమైనది..అనే క్యాప్షన్‌తో.. US కంపెనీ రీసైకిల్ షవర్ వాటర్‌తో తయారు చేసిన బీర్‌ను విడుదల చేసింది అని రాశారు.

ఇవి కూడా చదవండి

ఎపిక్ క్లీన్‌టెక్ నీటిని శుద్ధి చేసేందుకు మరో కంపెనీ సహాయం తీసుకుంది. వాటర్ ట్రీట్‌మెంట్ కంపెనీ డెవిల్స్ కాన్యన్ బ్రూయింగ్ కో.తో కలిసి దాని ఆన్‌సైట్ గ్రేవాటర్ రీయూజ్ సిస్టమ్‌ను ఉపయోగించి బీర్‌ను తయారు చేసింది. ఇది ప్రధానంగా స్నానం చేసిన నీరు, బట్టలు ఉతికిన వాటర్‌, పైకప్పుపై నుంచి పడే వర్షపు నీటిని పట్టుకోవడం, శుద్ధి చేయడం క్రిమిసంహారకం చేయడం కోసం ఉపయోగపడుతుంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ పై తీవ్ర చర్చ మొదలైంది. చాలామంది అలాంటి బీరుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. మరోవైపు, బీర్ తయారీకి పూర్వవైభవం రావడంతో బీర్ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..