Watch: బాబాయ్‌లు.. ఇక ఆడండి..పాడండి..! పెళ్లి బరాత్ లో డాన్స్ వేసే వారు చల్లగా ఉండాలని.. భలే ప్లాన్ చేశాడు..

|

Jun 16, 2023 | 1:41 PM

ఒక పెళ్లి ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ వీడియోలో ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి కూలర్లను ఉపయోగించారు. అవును, ఒకటి రెండు కూలర్లు కాదు, 11 కూలర్లు ఊరేగింపుతో పాటు బారులు తీయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Watch: బాబాయ్‌లు.. ఇక ఆడండి..పాడండి..! పెళ్లి బరాత్ లో డాన్స్ వేసే వారు చల్లగా ఉండాలని.. భలే ప్లాన్ చేశాడు..
Movable Cooler
Follow us on

గత కొద్ది రోజులుగా పెళ్లిళ్ల స్టైల్‌ మారింది. ఒకప్పుడు సాదాసీదాగా పూర్తయ్యే పెళ్లి వేడుకలు.. ప్రస్తుతం ఆకాశనంటుతున్నాయి. ఒకరికి మించి ఒకరు అట్టహాసం, ఆర్భాటంగా చేయాలని చూస్తున్నారు. ఇక పెళ్లిళ్ల విషయంలో డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తారు. వధూవరుల ప్రవేశమైనా, భోజన పానీయాలైనా, పెళ్లి ఊరేగింపు అయినా పైసా పేక్‌ తమాషా దేక్‌ అన్నట్టుగా చేస్తున్నారను. అవును, అతిథుల సౌలభ్యం విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వీడియోలు, సంఘటనలు అనేకం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక పెళ్లి ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ వీడియోలో ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి కూలర్లను ఉపయోగించారు. అవును, ఒకటి రెండు కూలర్లు కాదు, 11 కూలర్లు ఊరేగింపుతో పాటు బారులు తీయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

13 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో, బ్యాండ్-బాజాతో ఊరేగింపు రహదారి గుండా వెళుతుంది. ఇందులో బారాతీలతో పాటు అద్భుతమైన లైట్ల వెలుతురులో కూలర్ల క్యూ కూడా కనిపిస్తుంది. బారతీలు మండే వేడిలో కూడా కూల్‌గా డ్యాన్స్ చేసేలా ఉండేందుకు ఇలాంటి ఏర్పాటు చేశారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఊరేగింపు చూశారో లేదో మరీ. ఇప్పుడు ఈ వీడియో మాత్రం నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఇండోర్‌లోని రాజ్‌బాదా ప్రాంతానికి చెందిన ఒక హోటల్ యజమాని తన పెళ్లికి వచ్చిన అతిథులకు బరాత్‌లో వేడిని తగ్గించడానికి పోర్టబుల్ కూలర్‌లను ఏర్పాటు చేశాడు. ఎండకాలం కావటంతో అతిథులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, వారంతా హాయిగా డ్యాన్స్‌ చేసేందుకు కూలర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఊరేగింపుతో పాటుగా ట్రాలీలపై 11 పెద్ద కూలర్లు కూడా బారులు తీరాయి.

జూన్ 7న జరిగిన ఈ ఊరేగింపు వేడుక దాదాపు 1.5 కిలోమీటర్ల మేర సాగింది. దాదాపు 400 మంది అతిథులు హాజరయ్యారు. అతడి పెళ్లి బరాత్‌ రాజ్‌బాడా కూడలి గుండా వెళుతున్నప్పుడు స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ అయ్యింది. ఈ ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని జూన్ 15న ట్విట్టర్ యూజర్ ‘అనురాగ్ వర్మ’ పోస్ట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..