ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు.. టైర్లు లేకుండానే రోడ్డుపై దూసుకెళ్తోంది.. వీడియో చూస్తే అవాక్కే..!

|

Jun 29, 2023 | 2:51 PM

ధ్వంసమైన పాత కారును ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును తయారు చేశాడు. కారుకు గ్రో ప్రో కెమెరాను కూడా అమర్చారు. దాంతో ఈ కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్డంకులు ఉంటే అది ముందుగానే కనిపెట్టేందుకు వీలుంటుంది.. అధికారికంగా పీల్ ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో తయారైన PLP 50, ఇప్పటివరకు తయారు చేసిన అతి చిన్న కారు.

ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు.. టైర్లు లేకుండానే రోడ్డుపై దూసుకెళ్తోంది.. వీడియో చూస్తే అవాక్కే..!
Cheapest Car In The World
Follow us on

ఇంట్లో కారు ఉంటే ఎంత బాగుంటుంది. ఇంటిల్లిపాది కలిసి జాలిగా ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఎప్పుడంటే అప్పుడే నచ్చినటూరిస్ట్ స్పాట్ లు చూసిరావొచ్చు. బస్సులు, రైళ్ల కోసం ఎదురుచూడాల్సిన పనుండదు. కావాల్సిన సమయానికి బయలుదేరి, అనుకున్న సమయానికి తిరిగి రావచ్చు. ఇది మధ్యతరగతి ప్రజలందరి కల. కానీ కార్ల ధరల పెరుగుదల కారణంగా, ఈ కల చాలా మందికి కలగానే మిగిలిపోయింది. అయితే, ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా చెప్పబడుతున్న ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 13 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు.

ఈ విభిన్నమైన కారు వీడియో ఆటోమొబైల్ ప్రపంచంలో చాలా ప్రకంపనలు సృష్టించింది. ఇక్కడ ప్రత్యేకమైన డిజైన్‌లు, ప్రత్యేక లక్షణాలతో తయారైన ఈ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే.. కారు నడపడంలో టైర్లు చాలా ముఖ్యమైనవి. కానీ ఈ కొత్త కారులో టైర్లు లేవు, ఇది చదునైన రహదారిపై దానికదే కదులుతోంది. ఈ ప్రత్యేక వేరియంట్ కారు చూపరులను ఆశ్చర్యపరిచింది. టైర్లు లేకుండా కారును రూపొందించే సరి కొత్త అవకాశాల గురించి కార్ల కంపెనీలను ఆలోచించేలా చేసింది.

ఇవి కూడా చదవండి

టైర్లు, గేర్లు లేని కారు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది పిల్లల ఆట వస్తువుగా భావించి చాలా మంది అయోమయంలో పడ్డారు. కానీ రోడ్డుపై నడుస్తున్న ఈ కారును చూస్తే చాలా మంది ఆశ్చర్యంతో నోరుతెరిచి కన్నార్పకుండా చూస్తున్నారు. ఈ వీడియోను మాసిమో అనే ఖాతా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు అని క్యాప్షన్ ఇచ్చింది. 9 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో రోడ్డుపై కారు కదులుతుండగా.. చూపరులు ఆశ్చర్యంగా చూస్తూ.. ఫొటో దిగేందుకు వీడియో తీసేందుకు ఎగబడ్డారు.

ఈ కారును ఇటాలియన్ ఆటోమొబైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ తయారు చేశారు. కార్మగెడాన్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న యువకుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఈ కారు మేకింగ్ వీడియో ఉంది. ధ్వంసమైన పాత కారును ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును తయారు చేశాడు. కారుకు గ్రో ప్రో కెమెరాను కూడా అమర్చారు. దాంతో ఈ కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్డంకులు ఉంటే అది ముందుగానే కనిపెట్టేందుకు వీలుంటుంది.. అధికారికంగా పీల్ ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో తయారైన PLP 50, ఇప్పటివరకు తయారు చేసిన అతి చిన్న కారు. ఇది 52.8 అంగుళాలు (134 సెంటీమీటర్లు) పొడవు, 39 అంగుళాలు (99 సెంటీమీటర్లు) వెడల్పు, 39.4 అంగుళాలు (100 సెంటీమీటర్లు) పొడవు ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..