వేసవిలో ప్రజలు అధిక వేడిని నియంత్రించుకోవటానికి అనేక చర్యలు తీసుకుంటారు. సూర్య తాపానికి మనుషులే కాదు, జంతువులు కూడా ప్రభావితమవుతాయి. తాజాగా ఓ పిల్లి వడదెబ్బతో బాధపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రిఫ్రెష్ కోసం పుచ్చకాయ లాగిం చేస్తుంది. ఎండలో తిరిగిన పిల్లి వడదెబ్బకు గురైనట్టుగా ఉంది..అందుకే హాయిగా చల్లచల్లటి పుచ్చకాయతో ఉపశమనం పొందుతోంది. ఈ అందమైన పిల్లి వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. సాధారణంగా చేపలు, మాంసం తినే పిల్లులను మీరు చూసారు. కానీ ఈ పిల్లిని చూస్తే..ఇది ఖచ్చితంగా శాఖాహార పిల్లి అంటారు. ప్రస్తుతం ఈ పిల్లి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే పిల్లి పుచ్చకాయ తినడం ఎప్పుడైనా చూశారా? కానీ, ఈ పిల్లి పుచ్చకాయను తెగ లాగించేస్తుంది. ఆ పిల్లి యజమాని పుచ్చకాయ తింటుండగా, పిల్లి వెనుక నుండి వచ్చి అది కూడా పుచ్చకాయను తినడం ప్రారంభించింది. దాన్ని యజమాని చేతి నుంచి తీసుకుని పిల్లి కరమ్ కురుమ్ గా తినడం ప్రారంభిస్తుంది. ఈ వీడియో చూసిన వారికి, పిల్లి పుచ్చకాయను ఎలా తింటుంది? అని ఆశ్చర్యంగా ఉంది. ఈ అందమైన వీడియోను వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు.
Summer time.. ?
Sound on pic.twitter.com/npGbDVJkxs
— Buitengebieden (@buitengebieden) June 16, 2023
ఈ 10 సెకన్ల ఈ వీడియో ప్రజలను వేగంగా ఆకర్షిస్తోంది. దీన్ని ట్విటర్ హ్యాండిల్ బ్యూటెంగేబిడెన్ పోస్ట్ చేసింది. వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.1 మిలియన్ సార్లు వీక్షించారు. దీనికి దాదాపు 31.4 వేల లైకులు వచ్చాయి. దాదాపు 5 వేల మంది రీట్వీట్ చేశారు. పిల్లి పుచ్చకాయ తింటున్న ఈ అందమైన వీడియోకు కామెంట్స్ కూడా భారీగా వస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..