
మనం చాలా ఇతిహాసాలలో మత్స్యకన్యల గురించి విన్నాము. ఈ కల్పిత పాత్ర నిజంగా ఉందో లేదో శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. మత్స్యకన్య అంటే నీటిలో ఉండే దేవకన్య, లేదా జలకన్య అని పిలుస్తారు. ఆమె శరీరం సగం మనిషి,సగం చేప ఆకారంలో ఉంటుంది.. అంటే, మత్స్యకన్య శరీరం నడుము వరకు మనిషిలా ఉంటుంది. నడుము క్రింద నుండి చేపలా ఉంటుంది. మత్స్యకన్యల ఈ ప్రత్యేక లక్షణం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది.
ఈ ప్రత్యేకమైన మత్స్యకన్య కోసం ప్రజలు ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. ఇటీవల ఒక నదిలో మత్స్యకన్య కనిపించింది. ఆమె నీటిలో ఒక రాతిపై కూర్చుని ఉన్న వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఆమెను చూడగానే పడవలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు పట్టి బంధించారు. తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈ వీడియోలో, నీటిలో ఉన్న ఒక రాతిపై కూర్చున్న ఒక మత్స్యకన్య కనిపిస్తుంది. ఆమెకు ఎదురుగా ఎవరో వస్తున్నారని గమనించిన మత్స్యకన్య వెంటనే నీళ్లలోకి దూకేసింది. కానీ, మత్స్యకారులు ఆమెను పట్టుకోవడానికి ప్లాన్ చేసారు. వెంటనే వారు నీటిలోకి వల వేశారు. మత్స్యకన్య దానిలో చిక్కుకుంది. దాంతో వారు మత్స్యకన్యను తమతో తీసుకెళ్లేందుకు పడవలోకి ఎక్కించారు. అయితే, ఈ వీడియో నిజమా అబద్ధమా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. కానీ, ఇది ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అంతే వేగంగా వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వీడియోను వైరల్‌వర్స్‌వరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లు ఇప్పుడు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ వీడియో నిజమా, లేక ఏఐ ద్వారా చేశారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..