Viral Video: ఎనిమిది పదుల వయస్సులోనూ స్కేటింగ్‌‌లో ఇరగదీసిన బామ్మ.. ఈ వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

| Edited By: Janardhan Veluru

Aug 20, 2022 | 11:11 AM

కొన్ని పనులు చేయడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తోంది ప్రొఫెషనల్ స్కేటర్లు ది గ్రిఫిన్ బ్రదర్స్ తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో.. మనలో ఏదైనా చేయాలనే లక్ష్యం, ఉత్సాహం ఉంటే అది ఎలాంటి పనైనా సులవుగా..

Viral Video: ఎనిమిది పదుల వయస్సులోనూ స్కేటింగ్‌‌లో ఇరగదీసిన బామ్మ.. ఈ వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Skating Women
Follow us on

Viral News: ఎవరేం చేసినా వయస్సుకు తగట్టు ఉండాలంటారు.. ఎందుకంటే యవ్వనంలో చేసే పనులు వృధాప్యంలో చేయలేం.. అందుకే ఉద్యోగంలో అయినా క్రీడల్లో అయినా ఇంకే రంగం తీసుకున్నా.. ఓ వయస్సు వచ్చాక రిటైర్మెంట్ అవుతారు. క్రీడాకారులైతే వృధాప్యంలోకి వచ్చాక శారీరక ధృడత్వం కోల్పోతారు. కాని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తోంది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా.. రీడ్ దిస్ స్టోరీ.. కొన్ని పనులు చేయడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తోంది ప్రొఫెషనల్ స్కేటర్లు ది గ్రిఫిన్ బ్రదర్స్ తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో.. మనలో ఏదైనా చేయాలనే లక్ష్యం, ఉత్సాహం ఉంటే అది ఎలాంటి పనైనా సులవుగా చేసేయ్యొచ్చని నిరూపిస్తుంది ఈవీడియో.

86 ఏళ్ల వయస్సులోనూ వృద్ధ మహిళ ఎంతో ఆనందంగా తన స్కేటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న వీడియోను ది గ్రిఫిన్ బ్రదర్స్ ఇన్‌ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వీడియో చూస్తే ఆమె వృద్ధురాలు అనే భావన కలగకుండా.. ఓ ప్రొఫెషనల్ స్కేటర్ లా స్కేటింగ్ చేస్తుంది. ఎంతో శ్రద్ధతో వృద్ధురాలు స్కేటింగ్ చేస్తున్నట్లు వీడియోలో అర్థమవుతోంది. కొద్దిరోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈవీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోను చూసి వృద్ధ మహిళ పట్టుదలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె స్కేటింగ్ నైపుణ్యం ఎంతో ప్రేరణ ఇస్తోందని మరికొంతమంది కామెంట్స్ చేశారు. ఆమె ఎనర్జీ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నానని మరో యూజర్ కామెంట్ చెయగా.. ఇదెంతో అందమైన, అద్భుతమైన పోస్టు అంటూ కితాబిచ్చారు మరికొంతమంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..