
భారతీయ రైల్వే.. అలుపెరుగని ప్రయాణం..అందరికీ అందుబాటు ధరలతో అలసట లేకుండా ప్రయాణీకుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చే అత్యుత్తమ రవాణా మార్గం. సుదూర ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా అత్యంత సౌకర్యవంతమైన, చవకైన మార్గంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఈ రైళ్లల్లో కొందరి ప్రయాణం ఒక గంట ఉంటే.. మరికొందరి ప్రయాణం ఒకట్రెండు రోజులు కూడా ఉంటుంది. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే రైలు ప్రయాణ ఖర్చు తక్కువ. అలాగే, పిల్లలు, పెద్దలకు అనుకూలంగా ఉండే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అందుకే దాదాపు అందరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. కానీ, భారతదేశంలోని ఈ రైలులో కూర్చొని ప్రయాణీకులు అలసిపోతారు. ఆ కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
భారతదేశంలో ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. ఇవి 7300 కి పైగా రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంటాయి. ఈ రైళ్లలో కొన్ని సుదూర రైళ్లు అయితే, కొన్ని రైళ్లు చాలా తక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. కానీ, మనదేశంలోని ఒక రైలు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది. ఈ రైల్లో ప్రయాణించేవారు కూర్చుండి కూడా అలసిపోతారు. ఎందుకంటే.. ఈ రైలు భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. ఈ రైలు దాదాపు 4200 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుందట.
భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన రైలు పేరు వివేక్ ఎక్స్‌ప్రెస్. దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దాదాపు 4,200 కి.మీ ప్రయాణిస్తుంది. వారానికోసారి పట్టాలెక్కుతున్న ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటలు పడుతుందట. ఈ రైలు మార్గంలో సుమారుగా 50 స్టేషన్లు ఉన్నాయట.
ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. వివేక్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణించే ఈ రైలు ప్రయాణం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను చూపిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..