Hilarious Video: కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో చాలా కంపెనీలు తమ తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఇచ్చారు. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కంప్యూటర్, లాప్‌టాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆఫీసులో ఉండి పని చేయడానికి, ఇంట్లో ఉండి పని చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లల మధ్య విధులు నిర్వహించాలంటే తలకు మించిన భారంగా ఫీలవుతుంటారు చాలా మంది. ఇదే విషయం చాలా సర్వేల్లోనూ నిరూపితం అయ్యింది. ఎందుకంటే ఉద్యోగులు పని చేస్తున్న సమయంలో వారి పిల్లలు వారి వద్దకు వచ్చి అల్లరి చేయడం, విసిగించడం చేస్తుంటారు. కొంచెం పెద్దవారైతే.. తల్లిదండ్రలు చేస్తున్న పనులను అనుకరించడం చేస్తుంటారు. వారు కంప్యూటర్ నుంచి తప్పుకోగానే.. పిల్లలు ఆ సీటుపై కూర్చుని అప్పటి వరకు తమ తల్లిదండ్రులు ఎలాగైతే చేశారో.. అలాగే వీరు కూడా చేస్తూ ఇమిటేట్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఓ చిన్నారి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తన తల్లిని ఇలాగే ఇమిటేట్ చేసింది. ఈ చిన్నారి ఇమిటేట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. వర్జీనియాకు చెందిన కొలీన్ చులిస్.. వర్క్ ఫ్రమ్ చేస్తోంది. ఇంట్లోనే ప్రత్యేకంగా కంప్యూటర్ డెస్క్ ఏర్పాటు చేసుకుని పని చేస్తోంది. తల్లి పని చేస్తుండగా.. ఆమె కూతురు అడెల్లె(8) పలుమార్లు గమనించింది. ఈ క్రమంలో డెస్క్ నుంచి తన తల్లి పక్కకు వెళ్లగా.. వెంటనే ఆ కంప్యూటర్ డెస్క్‌పై అడెల్లి వెళ్లి కూర్చుంది. అప్పటి వరకు తన తల్లి ఏం చేసిందో.. తాను కూడా అలాగే ప్రవర్తిస్తూ ఇమిటేట్ చేసింది. కంప్యూటర్ నొక్కుతున్నట్లుగా.. ఆ వెంటనే ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నట్లుగా.. నోట్‌బుక్ ఇంపార్టెంట్ మ్యాటర్ నోట్ చేసుకుంటున్నట్లుగా.. తన వద్దకు వచ్చిన పిల్లలను వారిస్తున్నట్లు.. అచ్చం వాళ్ల అమ్మ ఎలాగైతే చేస్తుందో.. ఆ చిన్నారి కూడా అలాగే చేసింది. అయితే, అడెల్లె ఇమిటేట్ చేస్తుండగా.. కొలీన్ చులిస్ వీడియో తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యింది. వీడియోలో చిన్నారి హావభావాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. నెటిజన్లు ఈ చిన్నారి ఇమిటేషన్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు. కాగా, ఇప్పటి వరకు ఊహించని రీతిలో ఈ వీడియోకు 5 మిలియన్లకు పైగా లైక్స్ రాగా, 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
Viral Video:
Crazy – I posted a silly video of my daughter imitating me working on linked in and have 5M+ views 2 days later #workfromhome https://t.co/8QB7x1YPnM
— Colleen Chulis (@ColleenChulis) April 18, 2021
Also read: