Viral Video: దుమ్మురేపే షాట్‌తో దద్దరిల్లిన స్టేడియం.. నవ్వులు పూయిస్తోన్న విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్..

|

Dec 14, 2022 | 10:20 AM

Virat Kohli Viral Video: ఈ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: దుమ్మురేపే షాట్‌తో దద్దరిల్లిన స్టేడియం.. నవ్వులు పూయిస్తోన్న విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్..
Virat Kohli
Follow us on

Trending Video: నేటి నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. దీనికి ముందు భారత క్రికెట్ జట్టు ఫుల్ స్వింగ్‌తో ప్రాక్టీస్ పూర్తి చేసి సిద్ధమైన సంతగి తెలిసిందే. అయితే, ఇండియా నెట్స్ సెషన్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ యాక్షన్స్‌ను నవ్వులు పూయిస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే కెవ్వుకేక అంటున్నారు నెటిజన్స్.

మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. అక్షర్ వేసిన బంతికి క్రీజు నుంచి బయటకు వచ్చిన విరాట్.. దూకుడు షాట్ ఆడి భారీ సిక్సర్ బాదాడు. ఈ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. 91 బంతుల్లో 113 పరుగులు చేసి కెరీర్‌లో 72వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో అతను ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును దాటేశాడు. ఇప్పుడు సెంచరీల విషయానికొస్తే, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు కొట్టిన రికార్డును కలిగి ఉన్న సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.

ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయింది. రెండు ఆరంభ మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే, సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా పునరాగమనం చేసి బంగ్లాదేశ్‌ను 227 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సమయంలో ఇషాన్ కిషన్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ డబుల్ సెంచరీ సాధించాడు.

విరాట్ కోహ్లీ సిక్స్ వీడియో..

దీంతో టెస్టు సిరీస్‌పై భారత్‌పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్ కనీసం టెస్టు సిరీస్‌నైనా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఇప్పటికే ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. బంగ్లాదేశ్ గడ్డపై కూడా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్‌లో భారత్ 9 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..