AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాను..! ఏకంగా శుభలేఖపైనే ప్రింట్‌ చేయించిన వరుడు..

రాజస్థాన్‌లోని ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కట్నం రహిత వివాహమని, మద్యం, మాంసం నిషేధమని శుభలేఖపై ముద్రించారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు, ఇది సమాజానికి మంచి సందేశమని పేర్కొంటున్నారు. అనవసర ఖర్చులు తగ్గి, అమ్మాయిల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాను..! ఏకంగా శుభలేఖపైనే ప్రింట్‌ చేయించిన వరుడు..
Viral Wedding Card
SN Pasha
|

Updated on: Oct 23, 2025 | 9:50 PM

Share

ప్రతి ఒక్కరూ తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా శుభలేఖలు కూడా అందరికంటే డిఫరెంట్‌గా ఉండాలని ఆశపడతారు. అది డిజైన్‌, కలర్‌లో అయితే ఓకే కాని.. ఈ పెళ్లి కొడుకు చూడండి ఎంత విచిత్రమైన కార్డు కొట్టించాడో. పెళ్లికి తాను కట్నం తీసుకోవడం లేదని ఏకంగా శుభలేఖపైనే ప్రింట్‌ చేయించాడు. అలాగే పెళ్లిలో మద్యం, మాసం కూడా నిషేధించినట్లు రాయించాడు. దీంతో ఈ పెళ్లి కార్డు అందుకున్న వ్యక్తులు వివాహానికి వెళ్లాలా వద్దా అని ఆలోచించిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అఫీషియల్ రాజ్ సిసోడియా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో వివాహ ఆహ్వాన కార్డును చూడవచ్చు. ఈ వివాహ కార్డు రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన అజిత్ సింగ్ షెకావత్ కుటుంబానికి చెందినది. సంగ్రామ్ సింగ్, పూజ కూడా నవంబర్ 2, 2025న వివాహం చేసుకోగా, మరో జంట యువరాజ్ సింగ్, హర్షిత రాథోడ్ నవంబర్ 7, 2025న వివాహం చేసుకోనున్నారు. ఈ జంట వివాహ ఆహ్వాన కార్డులో ఇది వరకట్న రహిత వివాహం అని, మాంసం, మద్యం నిషేధించబడిందని చెప్పడం చూడవచ్చు.

ప్రతి కుటుంబం ఇంత సాహసోపేతమైన అడుగు వేసి మద్యం, మాంసం లేకుండా వివాహాన్ని నిర్వహించాలని నెటిజన్లు ఈ పెళ్లి కార్డు చూసి కామెంట్లు చేస్తున్నారు. మరొకరు ఇది సమాజానికి మంచి సందేశం అని, ఈ విధంగా చేస్తే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చునని వ్యాఖ్యానించారు. ఇది అమ్మాయి తల్లిదండ్రులు అప్పుల్లో మునిగిపోకుండా నివారిస్తుందని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి