చెట్టును కాపాడేందుకు యువకుడి సాహసం.. గాలివానలో తుఫానుతో యుద్ధం.. సెల్యూట్‌ సోదరా..!

|

Jun 19, 2022 | 12:34 PM

వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణ శాఖ కూడా రెయిన్‌ అలర్ట్‌ ప్రకటించింది. అయితే, జోరుగా గాలివాన కురుస్తుంటే, ఎవరైనా ఏం చేస్తారు..? ఇదేం ప్రశ్నం ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారు. అవసరమైతేనే తప్ప బయటకు రాకుండా ఉంటారు.

చెట్టును కాపాడేందుకు యువకుడి సాహసం.. గాలివానలో తుఫానుతో యుద్ధం.. సెల్యూట్‌ సోదరా..!
Save The Tree
Follow us on

వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణ శాఖ కూడా రెయిన్‌ అలర్ట్‌ ప్రకటించింది. అయితే, జోరుగా గాలివాన కురుస్తుంటే, ఎవరైనా ఏం చేస్తారు..? ఇదేం ప్రశ్నం ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారు. అవసరమైతేనే తప్ప బయటకు రాకుండా ఉంటారు. గాలివాన, వరదల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. కానీ, ఎవరూ చెట్ల గురించి ఆలోచించరు. కానీ, ఇక్కడో యువకుడు మాత్రం చెట్టుకోసం ఏకంగా తుఫానుతోనే పోరాటం చేశాడు. ప్రాణాలకు తెగించి జోరుగాలివానలో చెట్టును రక్షించేందుకు పోరాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలిపోయేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ యువకుడి పొలంలోని అరటి చెట్టు కూడా గాలి ఉధృతికి ఊగిపోతోంది.కూకటి వేళ్లతో సహా చెట్టు కొట్టుకుపోయే స్థితిలో కనిపిస్తోంది. అది చూసిన ఆ యువకుడు ఆ అరటి చెట్టును కాపాడుతున్నాడు.పై నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. అదే సమయంలో భీకర గాలివీస్తోంది. గాలివాన దాటికి అరటిచెట్టు ఊగిపోతోంది. తుఫాన్‌ సమయంలో అతడు అరటి చెట్టుకు రక్షణగా నిలబడి నేలవాలకుండా రక్షణగా నిలబడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చెట్లను కాపాడాలన్న ఈ యువకుడి స్ఫూర్తికి పలువురు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఈ వ్యక్తి చెట్టును కాదు మన భవిష్యత్తును కాపాడుతున్నాడు అంటూ కామెంట్‌ చేశారు. అదే సమయంలో ఈ కథ అంతా రీల్ చేయడానికే ఈ వీడియో చేశారంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. ఇలాంటి ఘోరమైన స్టంట్ చేయవద్దని పలువురు ఈ యువకుడికి సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి