వావ్.. కేవలం 3 సెకన్లలో 3 దేశాల్లో ప్రయాణించిన యువతి.. నమ్మక పొతే వీడియోపై ఓ లుక్ వేయండి..

|

Apr 22, 2024 | 8:32 PM

కారు లేదా బస్సును తమ ఇల్లుగా చేసుకుని దానిలో ప్రయాణిస్తూ ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు చాలానే వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రజలు విమానం లేదా క్రూయిజ్‌లో విదేశాలకు వెళతారు.  అయితే ఈ రోజుల్లో ఒక మహిళ కేవలం మూడు సెకన్లలో మూడు దేశాలను సందర్శించి వార్తల్లో నిలిచింది.  అయితే ఇది ఖచ్చితంగా నిజం. సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ సెకన్లలో మూడు దేశాలకు వెళ్లడాన్ని చూడవచ్చు. ఆ మహిళ అడవిలాంటి ప్రదేశంలో ఉంది

వావ్.. కేవలం 3 సెకన్లలో 3 దేశాల్లో ప్రయాణించిన యువతి.. నమ్మక పొతే వీడియోపై ఓ లుక్ వేయండి..
Three Countries In Seconds
Image Credit source: Instagram/roxonajourney
Follow us on

ప్రపంచంలో ప్రయాణించడం అంటే ఇష్టపడే చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇలా ప్రయాణం చేయడం కోసం చాలా మంది తమ ఉద్యోగాలను కూడా విడిచిపెడుతూ ఉంటారు. అంతేకాదు కొందరు వ్యక్తులు తమ ఇంటిని, మొత్తం ఆస్తిని ప్రయాణించడం కోసం అమ్మేసినవారు కూడా ఉన్నారు. అంతేకాదు కారు లేదా బస్సును తమ ఇల్లుగా చేసుకుని దానిలో ప్రయాణిస్తూ ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు చాలానే వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రజలు విమానం లేదా క్రూయిజ్‌లో విదేశాలకు వెళతారు.  అయితే ఈ రోజుల్లో ఒక మహిళ కేవలం మూడు సెకన్లలో మూడు దేశాలను సందర్శించి వార్తల్లో నిలిచింది.  అయితే ఇది ఖచ్చితంగా నిజం.

సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ సెకన్లలో మూడు దేశాలకు వెళ్లడాన్ని చూడవచ్చు. ఆ మహిళ అడవిలాంటి ప్రదేశంలో ఉంది. అక్కడ ఉన్న గుండ్రటి సిమెంటు నేలపై మూడుసార్లు దూకి యుద్ధంలో గెలిచినంత ఆనందంగా ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. వాస్తవానికి, మహిళ మొదటి జంప్ చేసినప్పుడు.. ఆమె నేరుగా బెల్జియంకు వెళ్లి, రెండవ జంప్ తో ఆమె నెదర్లాండ్స్ సరిహద్దులోకి ప్రవేశించింది. అదేవిధంగా మూడవ జంప్ తీసుకున్న తర్వాత ఆమె జర్మనీకి వెళ్లింది. ఈ విధంగా ఆ యువతి కేవలం మూడు సెకన్లలో మూడు దేశాలను సందర్శించింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

 

 

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో roxonajourney అనే IDతో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 3.5 మిలియన్లు అంటే 35 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే 1 లక్ష 45 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ఇది పాస్‌పోర్ట్ లేకుండా చేస్తున్న అక్రమ ప్రయాణం’ అని ఎవరో ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే. ‘ఎప్పుడైనా ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో కూడా ఇలా ప్రయాణం చేసి చూడండి’ అని ఒకరు అంటున్నారు. అదేవిధంగా, ‘బ్రాటిస్లావా అనేది మూడు దేశాల సరిహద్దులు కలిసే నగరం’ అని ఒకరు తమ కామెంట్ లో పేర్కొన్నారు. ఈ దేశాలు చెకియా, ఆస్ట్రియా, హంగేరి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..