Elephant: గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
ప్రమాదవశాత్తు గాయాలపాలైన ఓ ఏనుగుపిల్ల మృతిచెందింది. రోడ్డు పక్కన కదలకుండా పడిఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిన తల్లి ఏనుగు బిడ్డ మృతదేహం చుట్టూ తిరుగుతూ హల్‌చల్ చేసింది. వచ్చీ పోయే వాహనాలనుంచి తన బిడ్డను కాపాడుకోవాలనుకుందో ఏమో వాటిపై దాడికి దిగింది. వాహనాలు గున్న ఏనుగువైపు రాకుండా తరిమి కొట్టింది. దీంతో రోడ్డుకు ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ప్రమాదవశాత్తు గాయాలపాలైన ఓ ఏనుగుపిల్ల మృతిచెందింది. రోడ్డు పక్కన కదలకుండా పడిఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిన తల్లి ఏనుగు బిడ్డ మృతదేహం చుట్టూ తిరుగుతూ హల్‌చల్ చేసింది. వచ్చీ పోయే వాహనాలనుంచి తన బిడ్డను కాపాడుకోవాలనుకుందో ఏమో వాటిపై దాడికి దిగింది. వాహనాలు గున్న ఏనుగువైపు రాకుండా తరిమి కొట్టింది. దీంతో రోడ్డుకు ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో బందిపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గున్న ఏనుగు మృత కళేబరాన్ని అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నించారు. తల్లి ఏనుగు ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి దిగింది. సిబ్బందిని గున్న ఏనుగు దగ్గరకు రాకుండా తరిమికొట్టింది. ఈ క్రమంలో రోడ్డుకు ఇరు వైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో మైసూరునుంచి ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఎట్టకేలకు తల్లి ఏనుగును అటవీప్రాంతంలోకి పంపించారు. అనంతరం ఫారెస్ట్ సిబ్బంది గున్న ఏనుగు మృతకళేబరాన్ని అక్కడినుంచి తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

