Viral Video: ఇదెక్కడి డ్యాన్స్‌రా బాబు.. దెబ్బకి జడుసుకున్న జనాలు..!

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకర వీడియోలు ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరమైన వీడియోలు

Viral Video: ఇదెక్కడి డ్యాన్స్‌రా బాబు.. దెబ్బకి జడుసుకున్న జనాలు..!
Funny Dance
Follow us
uppula Raju

|

Updated on: Apr 04, 2022 | 6:18 PM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకర వీడియోలు ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరమైన వీడియోలు ఉంటాయి. కొన్ని వీడియోలు హాస్యాన్ని పండిస్తే మరికొన్ని తమషాగా ఉంటాయి. తాజాగా ఒక మహిళ డ్యాన్స్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ చేతిలో మైక్‌ పట్టుకొని ప్రశాంతంగా నిలబడి ఉండటం మనం గమనించవచ్చు. ఉన్నట్టుండి సాంగ్‌ ప్లే కాగానే పూనకం వచ్చిన మాదిరి అక్కడి ప్రదేశం మొత్తం తిరుగుతూ ఒక వింతైన డ్యాన్స్‌ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. అంతేకాదు ఆమె ఒక్కసారిగా చేసిన డ్యాన్స్‌కి ప్రేక్షకులందరు భయపడిపోయారు. వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి డ్యాన్స్‌రా బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది.

ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్‌ చేశాడు. ‘బ్రేస్ యువర్ మ్యాన్’ అనే క్యాప్షన్‌ రాయడం విశేషం. ఒక రోజు క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 62 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో చాలా మంది ఫన్నీ కామెంట్స్‌ చేస్తు్న్నారు. ఒక నెటిజన్ ఆంటీ జీ డ్యాన్స్‌ అదిరిపోయిందని కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ చుట్టుపక్కలవారు జడుసుకున్నారు అంటూ కామెంట్ చేశాడు. ఇంకొక నెటిజన్ వీడియో చూసిన తర్వాత నవ్వలేకపోతున్నానంటూ తన స్పందనని తెలియజేశాడు. ఓవరాల్ గా ఈ వీడియోని జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని తిలకించినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడికి మంచి మార్గం..SIPతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్

Health Tips: తలపై దురద భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో సింపుల్‌గా వదిలించుకోండి..!

Health Photos: గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!