Viral Video: స్త్రీ.. మృగరాజునే పసిపాప చేసేందిగా.. హ్యాపీగా స్నానం చేయించుకుంటున్న సింహం.. షాకింగ్ వీడియో వైరల్
అడివికి రాజైనా అమ్మ మనసుకు దాసోహం ఏమో అనిపిస్తుంది ప్రసుత్తం వైరల్ అవుతున్న ఒక వీడియో. ఒక మహిళ సింహానికి స్నానం చేయిస్తోంది. కొన్ని సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియో అందరి మనసులను కదిలించింది. ఈ వీడియో చూసిన తరవాత మీరు కూడా ఆశ్చర్య పోతారు. ఇలా సింహానికి స్నానం చేయిన్న స్త్రీని అమీనా ఖాన్ అని గుర్తించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కి లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

సోషల్ మీడియా ‘ప్రపంచంలో’ ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో ఊహించడం చాలా కష్టం. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. మరికొన్ని ఇది నిజమేనా అంటూ మనం నమ్మడానికి కొంచెం కష్టం అనిపిస్తాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక మహిళ క్రూరమైన సింహం ఒంటిని రుద్దుతూ .. ఏదో చిన్న పిల్లలకు చేయిస్తున్న స్నానం చేయిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో పాకిస్తాన్ కి సంబంధించినది అని తెలుస్తోంది.
ఈ వైరల్ వీడియో కొన్ని సెకన్లు మాత్రమే ఉంది. అయితే ఇలా సింహాన్ని పెంపుడు కుక్కలా ఇంటి ముందు కట్టేసి మరీ స్నానం చెయిన్న మహిళను అమీనా ఖాన్ గా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ వీడియోలో మహిళ సింహానికి స్నానం చేయిస్తుంటే ఆ క్రూర జంతువు కూడా ఈ క్షణాన్ని చాలా ఆస్వాదిస్తోంది.
ఈ దృశ్యం నిజంగా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఈ క్రూర జంతువులను మచ్చిక చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా..వాటి స్వభావం ఎప్పుడూ దాడి చేయడమే. వీడియోలో ఆ స్త్రీ సింహానికి అస్సలు భయపడదని, బదులుగా ఆమె తన పిల్లల్లాగే దానికి స్నానం చేయిస్తోందనిపిస్తుంది చూపరులకు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
ఈ షాకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @aminakhanofficial84 అనే ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు 16 వేలకు పైగా లైక్ చేశారు. చాలా మంది వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ మహిళను ధైర్యవంతురాలి అని ప్రశంసించారు. అయితే చాలా మంది వినియోగదారులు మృగరాజు సరదాగా హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక యూజర్ ఏయ్ సిస్టర్, దయచేసి కొంచెం షాంపూ కూడా రాయండి అని కామెంట్ చేయగా.. మరొక యూజర్ అది మిమ్మల్ని తినేయకుండా జాగ్రత్త అని హెచ్చరించారు. ఇంకో యూజర్ సరదాగా “భాభి జీ, దయచేసి సింహానికి కొంచెం ఆహారం బాగా పెట్టండి.. ఎందుకంటే అది ఎంత సన్నగా అయిపోయిందో చూడండి అని ఫన్నీగా కామెంట్ చేశారు.
మరిన్ని టెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




