Viral Video: అరే ఏంట్రా ఇది.. పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

|

Dec 26, 2024 | 9:23 PM

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైన పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో పెళ్ళికొడుకు లేదా పెళ్లి కుమాతురికి సంబంధించి వింత, విచిత్ర సన్నివేశాల వార్తలు ఎక్కువగా చూస్తుంటాం. ఇకపోతే తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

Viral Video: అరే ఏంట్రా ఇది.. పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
A Panditji Gets Angry
Follow us on

భారతీయ వివాహాలు వినోదం, సంగీతం, డ్యాన్స్‌లు, కుటుంబం సభ్యులు, బంధుమిత్రుల కోలాహలంతో సందడిగా సాగుతాయి. వివాహాలలో వధువు, వరుడి కుటుంబాలు, స్నేహితుల మధ్య వివిధ కారణాల వల్ల వాదనలు జరగడం సర్వసాధారణం. అయితే, సోషల్ మీడియాలో ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి వేగంగా వైరల్‌ అవుతోంది. వేదికపై వధూవరులు అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా వారి స్నేహితులు పట్టిస్తున్నారు.. అదంతా చూసి పురోహితుడు చేసిన పని ఇప్పుడు నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేసింది.

వైరల్ వీడియో వివాహ వేడుకకు సంబంధించినది. పెళ్లి వేదికపై వధూవరులు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అంతలోనే వారి స్నేహితుల వారిపై పూలతో దాడికి డిగారు. కొత్త జంటపై వారంతా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎంతలా అంటే.. పూలతో సంతోషంగా కొడుతున్న దెబ్బలు వారిని ఇబ్బందికి గురిచేశాయి. ఆ తర్వాత జరిగిన సీన్‌ ఎవరూ ఊహించలేనిది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వధూవరులు సంతోషంగా అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా, వారి స్నేహితులు చేసిన పూల దాడికి అక్కడే ఉన్న పురోహితుడు ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయాడు. పట్టరాని కోపంతో పక్కనే ఉన్న ఒక ప్లేట్‌ ఎత్తుకుని వారిపై దాడికి యత్నించాడు.. అతిథులలో ఒకరికి ఆ ప్లేట్‌ బలంగానే తగిలింది. ఊహించని విధంగా వేదికపై పంతులు ప్రవర్తించిన తీరుకు వధూవరులతో పాటు అందరినీ షాక్‌కి గురి చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియా హ్యాండిల్ Xలో @gharkekalesh అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఇది ఇప్పటివరకు సుమారు 33.4k మంది వీక్షించారు. 1.3k కంటే ఎక్కువ మంది దీన్ని లైక్ చేసారు. ఈ వీడియో చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..