Viral Video: అమెరికాలో జీవితం ఎంత ఖరీదైందో తెలుసా.. చుక్కలు తాకే భారతీయ సరుకుల ధరలు

అగ్రరాజ్యం అమెరికా చదువుకోడానికి , ఉద్యోగం కోసం వెళ్ళడం నేటి యువత కోరిక. ఏ మాత్రం అవకాశం దొరికినా అమెరికాలో అడుగు పెట్టాలని తహతహలాడతారు. అయితే ప్రస్తుతం ఒక ప్రవాస భారతీయుడికి సంబంధించిన ఒక వీడియో ప్రజలల్లో చర్చకు దారితీసింది. అందులో అమెరికాలోని సూపర్ మార్కెట్లు భారతీయ ఉత్పత్తులను ఎలా ఉంచుతాయి? వాటి ధర ఎంత అనే విషయం చెప్పాడు. ఈ వీడియో చూసిన తర్వాత భారతీయులు ఓ రేంజ్ లో చర్చిస్తున్నారు.

Viral Video: అమెరికాలో జీవితం ఎంత ఖరీదైందో తెలుసా.. చుక్కలు తాకే భారతీయ సరుకుల ధరలు
Wall Mart In Dallas

Updated on: Aug 25, 2025 | 10:42 AM

అమెరికాలోని డల్లాస్ నగరంలో నివసిస్తున్న ఒక భారతీయ ప్రవాసికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఈ రోజుల్లో వార్తల్లో ఉంది. ఈ వీడియోను రజత్ అనే వ్యక్తి షేర్ చేశారు. అందులో వాల్‌మార్ట్ స్టోర్ లోపల ఉన్న భారతీయ ఉత్పత్తులను చూపించాడు. ఈ వీడియోలో స్టోర్ షెల్ఫ్‌లో ఉంచిన పప్పులు, నమ్‌కీన్, బిస్కెట్లు , వివిధ రకాల మసాలా సుగంధ ద్రవ్యాలు, సాస్‌ల ప్యాకెట్‌లను చూపించాడు. ఇవన్నీ మన భారతీయులకు ఇష్టమైనవని చెప్పాడు.

ఇక్కడ రాయల్ బ్రాండ్ పప్పులు, మసూర్ పప్పు, పెసర పప్పు దాదాపు $4కి దొరుకుతాయని రజత్ చెప్పారు. హల్దిరామ్ కట్టా మీఠా నమ్కీన్, ఆలూ భుజియా కూడా దాదాపు $4కి దొరుకుతున్నాయి. పార్లే హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు దాదాపు $4.5కి అమ్ముడవుతున్నాయి. ఒక షెల్ఫ్‌లో పార్లే-జి, గుడ్ డే, బిర్యానీ మసాలా, తందూరీ మసాలా, బటర్ చికెన్ సాస్ సహా అనేక ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. డల్లాస్‌లో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.. కనుక వాల్‌మార్ట్ ఈ వస్తువులను కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉంచిందని రజత్ అన్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

 

రజత్ షేర్ చేసిన ఈ చిన్న వీడియో భారతీయ కిరాణా సామాగ్రిని చూపించడమే కాకుండా స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా పెద్ద దుకాణాలు తమ ఉత్పత్తులను ఎలా ఎంచుకుంటాయో కూడా చూపిస్తుంది. డల్లాస్ వంటి నగరాల్లో భారతీయ జనాభా ఎక్కువగా ఉండటంతో.. సూపర్ మార్కెట్లు స్థానికంగా నివసించే అధిక వర్గాల రుచి, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ ధరలపై చర్చ జరుగుతుంది. అంతేకాదు మన దేశంలో తక్కువ ధరకే చౌకగా లభించే ఈ ఉత్పత్తులను విదేశాలకు వలస వెళ్ళిన వారు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఈ వీడియో చూపిస్తోంది. అయినప్పటికీ.. ప్రజలు తమ దేశ ఆహారపు అలవాట్లను, రుచిని పొందడానికి ఇంతటి ధరలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ వీడియోవైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో ప్రజల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘ఏయ్, భారతదేశంతో పోలిస్తే అమెరికాలో ప్రతిదీ చాలా ఖరీదైనదని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు నాలుగు డాలర్లకు హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 320 రూపాయలు! భారతదేశంలో.. దీని ధర కేవలం 20 రూపాయలు. అంతేకాదు అర కిలో పప్పు దాదాపు 400 రూపాయలకు? అక్కడ డాలర్ల జీవితం ఎంత ఖరీదైనది అని అంటున్నారు. కెనడాలో నివసిస్తున్న ఒక వ్యక్తి భారతీయ వస్తువులు కెనడాలో కంటే అమెరికాలో మరింత ఖరీదైనవని చెప్పారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..