Viral Video: ఓర్నీ.. భార్యకు కోపం వస్తే ఇలా ఉంటుందా?… ఇది చూశాక మీ ఆవిడకు ఆగ్రహం తెప్పించే సాహసం చేస్తారా?

సంసారంలో గిల్లి కజ్జాలు అనేవి సహజంగా జరుగుతుంటాయి. ఆ మాటకోస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యతకు గిల్లికజ్జాలే నిదర్శనం అంటూ ఉంటారు. అయితే అవి ముదిరి పాకానా పడకుండా చసుకోవాల్సిన బాధ్యత ఇరువురి మీద ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యల మీద వాదనలు ఎంత పొడిగించకుండా...

Viral Video: ఓర్నీ.. భార్యకు కోపం వస్తే ఇలా ఉంటుందా?... ఇది చూశాక మీ ఆవిడకు ఆగ్రహం తెప్పించే సాహసం చేస్తారా?
Woman Smashes Husband Car

Updated on: Nov 13, 2025 | 5:03 PM

సంసారంలో గిల్లి కజ్జాలు అనేవి సహజంగా జరుగుతుంటాయి. ఆ మాటకోస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యతకు గిల్లికజ్జాలే నిదర్శనం అంటూ ఉంటారు. అయితే అవి ముదిరి పాకానా పడకుండా చసుకోవాల్సిన బాధ్యత ఇరువురి మీద ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యల మీద వాదనలు ఎంత పొడిగించకుండా ఉంటే అంత మంచింది. లేదందే ఈ వైరల్‌ వీడియోలో మాదిరిగా జరిగే ప్రమాదం ఉంటుంది.

ఇంటి బాధ్యతలు చూసే భార్యలకు కొంతమంది భర్తలు ర్తలు డబ్బులు ఇవ్వక పోవటం వల్ల సమస్యలు వస్తుంటాయి. చివరికి ఇద్దరిమ మధ్య గొడవలకు దారి తీస్తుంటుంది. తాజాగా ఓ భార్య ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తన ప్రతాపాన్ని చూపెట్టింది. భర్త మీద కోపాన్నంతా కారు మీద చూపెట్టింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్‌నోర్ జిల్లా, నాజిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లుగా తెలుస్తోంది.

ధర్మేంద్ర, హిమాని భార్యాభర్తలు. ధర్మేంద్ర ఉద్యోగం చేస్తుండగా హిమాని గృహిణిగా ఇంటిపట్టునే ఉంటుంది. కొద్దిరోజుల క్రితం హిమాని తన భర్తను పాకెట్ మనీ కోసం డబ్బులు అడిగింది. ఇందుకు ధర్మేంద్ర డబ్బులు లేవని చెప్పాడట. కొంచెం సేపు తర్వాత డబ్బులు ఉన్నాయి కానీ కారు రిపేర్‌ చేసుకోవాలని అన్నాడట. అంతే.. భార్య కోపం కట్టలు తెంచుకుంది. ఓ సుత్తె తీసుకుని కారునే భర్తలా భావించి దాని మీద తన ప్రతాపం చూపెట్టింది. సుత్తెతో కారు అద్దాలను పగలగొట్టింది.

వీడియో చూడండి:

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో కారు అద్దాలు ధ్వంసం అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఆ కారును తమ ఫోన్లలో వీడియో తీస్తున్నారుఆర. వైరల్‌ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. భార్యకు కోపం వస్తే ఇలానే ఉంటుంది అంటూ పోస్టులు పెడుతున్నారు.