Viral Video: సొంత అన్న, చెల్లిని ప్రేమికులుగా భావించి కొట్టి జైల్లో పెట్టిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

|

Aug 29, 2024 | 7:56 PM

పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తునే ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో సంఘటనకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పోలీసు కానిస్టేబుల్‌ యువతీ యువకుడిని ప్రేమికులని అనుమానించమే కాదు కొట్టి వారిద్దరినీ 24 గంటలపాటు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: సొంత అన్న, చెల్లిని ప్రేమికులుగా భావించి కొట్టి జైల్లో పెట్టిన కానిస్టేబుల్.. వీడియో వైరల్
Up Police Man
Follow us on

ఒక్కోసారి పోలీసుల దౌర్జన్యపూరిత ప్రవర్తన, సామాన్యులపై అణచివేత ధోరణి ప్రజలను ఆందోళనకు గురి చేస్తూనే ఉంటుంది. అవును కొందరు పోలీసులు అధికారం తమ సొంతం అంటూ దారుణంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా పేద ప్రజలపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తునే ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో సంఘటనకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పోలీసు కానిస్టేబుల్‌ యువతీ యువకుడిని ప్రేమికులని అనుమానించమే కాదు కొట్టి వారిద్దరినీ 24 గంటలపాటు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సివిల్ డ్రెస్‌లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓ అమాయక యువకుడిని కొట్టాడు. అతనితో పాటు అతని సోదరిని 24 గంటలపాటు జైల్లో ఉంచిన సిగ్గుమాలిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. బాధిత యువకుడు తన సోదరితో కలిసి పట్టణానికి వచ్చాడు. వీరిద్దరినీ ప్రేమికులని తప్పుగా భావించిన పోలీసు కానిస్టేబుల్ యువకుడి మెడ పట్టుకున్నాడు. ఆ యువకుడి సోదరి అని చెప్పినా వినకుండా ఆ పోలీసు ఆ యువకుడిపై చేయి చేసుకున్నాడు. తమని వదిలి పెట్టమని వేడుకున్నా వినకుండా ఇద్దరినీ జైలులో పెట్టాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ ఘటనకు సంబంధించి ఒక పోస్ట్ NCMIndiaa అనే పేరు గల X ఖాతాలో షేర్ చేశారు. అందులో “ఉత్తరప్రదేశ్ లోని సివిల్ డ్రెస్‌లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రేమికులని అనుమానిస్తూ సోదరితో వచ్చిన సోదరుడిపై దాడి చేసి అరెస్ట్ చేశాడు. ఇది నిజంగా సిగ్గుచేటు” అని క్యాప్షన్ జత చేశాడు. వైరల్ వీడియో ఆగస్టు 27న షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను 41,000 మంది చూశారు. రకరకాల కామెంట్స్ చేశారు. “ఇది నిజంగా అవమానకరం,” అని ఒకరు అన్నారు. మరొకరు “ఆ తెలివితక్కువ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోండి” అని కామెంట్ చేశారు.

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..