Viral Video: నాగుపాము వెళుతూ వెళుతూ పులి దిక్కు చూసింది..అంతే ఇగ!.. ఆ తర్వాత అక్కడ జరిగిన సీన్ చూడాల్సిందే!
పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా అక్కడ పాము కనిపిస్తే ఇక్కడి నుంచే జారుకుంటారు. ఇక పడగ విప్పిన విషపు నాగు కనిపిస్తే పై ప్రాణాలు పైనే పోయినంత పనయితది. మనుషులకే కాదు.. జంతువులు కూడా పాము కనిపిస్తే జంకాల్సిందే. అందుకు సంబంధించిన...

పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా అక్కడ పాము కనిపిస్తే ఇక్కడి నుంచే జారుకుంటారు. ఇక పడగ విప్పిన విషపు నాగు కనిపిస్తే పై ప్రాణాలు పైనే పోయినంత పనయితది. మనుషులకే కాదు.. జంతువులు కూడా పాము కనిపిస్తే జంకాల్సిందే. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఇక్కడ పామును చూసి భయపడింది సాదాసీదా జంతువు కాదు.. అది పెద్దపులి. అందుకే ఆ వీడియో అంత వైరల్‌గా మారింది.
పాములను చూసి క్రూర జంతువులు కూడా భయపడతాయని వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోలో పడగ విప్పి వెళుతున్న పామును చూసి ఓ పెద్ద పులి వెనకకు అడుగులు వేయడం కనిపిస్తుంది. సాధారణంగా పెద్ద పులులు ఎలాంటి జంతువునైనా ఒక్క పంజాతో మట్టికరిపిస్తాయి. అలాంటిది పామును చూసి పులి భయపడిన వీడియోను నెటిజన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో దట్టమైన అడవిలో అప్పుడే వర్షం ఆగినట్లు ఉంది. బాట మీద వర్షపు నీరు ప్రవహిస్తోంది. అప్పుడే ఆ బాట మీది నుంచి ఓ పులి నడుచుకుంటూ బయటికి రావడం కనిపిస్తుంది. పులి వస్తుండగా దారికి అడ్డంగా పాము పడగ విప్పి వెళ్లడం పులి కంట పడింది. దాంతో పులి అక్కడే దూరంగా ఆగిపోయింది. అదే సమయంలో పాము వెళుతూ వెళుతూ తల తిప్పి పులి వైపూ చూడటం వీడియోలో చూడొచ్చు. వెంటనే పులి భయపడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకైనా మంచిదని పులి రెండడుగులు వెనక్కి వేయడం చూస్తాం. నిజానికి నాగుపాము కాటు వేస్తే పెద్ద పులి ప్రాణాలైనా గాల్లో కలవాల్సిందే. అడవిలోని జంతువులను నిర్దాక్షిణ్యంగా వేటాడే పులి తనను తాను రక్షించుకునేందుకు వెనకడుగు వేసిన వీడియోను నెటిజన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది కామెంట్ల వర్షం కురిపించారు. ఎంత బలవంతుడైనా సరే ప్రమాదానికి ఎదురెళ్లడం అవివేకం అనే విషయం పులిని చూసి నేర్చుకోవాలని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.
