Viral Video: ఇదేం ఆనందంరా నాయనా.. దొంగతనానికి వెళ్లి డ్యాన్స్‌ చేసిన ఘనుడు.. చివరికి ఏమైందంటే..

Uttar pradesh: సాధారణంగా దొంగతనానికి వెళ్లిన వారు ఎంత త్వరగా పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి బయటపడదామా అనే ఆలోచనలో ఉంటారు. అయితే దుకాణంలోకి చోరీకి వెళ్లిన ఓ దొంగ మాత్రం ఆశ్చర్యకరంగా హుషారుగా డ్యాన్స్‌ చేశాడు

Viral Video: ఇదేం ఆనందంరా నాయనా.. దొంగతనానికి వెళ్లి డ్యాన్స్‌ చేసిన ఘనుడు.. చివరికి ఏమైందంటే..

Edited By: Ravi Kiran

Updated on: Apr 20, 2022 | 9:52 AM

Uttar pradesh: సాధారణంగా దొంగతనానికి వెళ్లిన వారు ఎంత త్వరగా పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి బయటపడదామా అనే ఆలోచనలో ఉంటారు. అయితే దుకాణంలోకి చోరీకి వెళ్లిన ఓ దొంగ మాత్రం ఆశ్చర్యకరంగా హుషారుగా డ్యాన్స్‌ చేశాడు. వచ్చిన పని తొందరగా పూర్తయిందనుకున్నాడో లేకపోతే అక్కడి ఖరీదైన వస్తువులను చూసి ఆనందం పొంగుకొచ్చిందో తెలియదు కానీ స్టెప్పులు వేస్తూ రచ్చ రచ్చ చేశాడు. యూపీలోని అందౌలీలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వివరాల్లోకి వెళితే.. అందౌలీలో ఉన్న హర్డ్ వేర్ దుకాణంలోకి ఓ దొంగ దూరాడు. ఎవరూ తనను గుర్తుపట్టకుండా ముఖానికి స్కార్ప్ కూడా కట్టుకున్నాడు ఆ దొంగ. తన చోర కళతో షెట్టర్ తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. కౌంటర్‌లో ఉన్న నగదు, ఇతర ఖరీదైన వస్తువులను దొంగతనం చేశాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోకుండా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. కొద్దిసేపు అలాగే స్టెప్పులేసిన తర్వాత వచ్చిన దారిలోనే బయటకు వెళ్లిపోయాడు. ఇక తెల్లవారగానే.. షాపుకు వచ్చిన యజమాని అక్కడి పరిస్థితిని చూసి షాక్‌ తిన్నాడు. దొంగతనం జరిగిందని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో రెండు చేతులు ఊపుకుంటూ దొంగ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు వారిని షాకింగ్‌కు గురి చేశాయి. పోలీసులు కూడా దొంగ ప్రవర్తనను చూసి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read:Viral Video: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చి పక్కనే కుర్చున్న బస్సు డ్రైవర్.. చివరకు..

PM Modi: భారత సాంప్రదాయ వైద్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు.. WHO చీఫ్‌ టెడ్రోస్‌తో కలిసి మోదీ టూర్..

Beauty Tips: వేసవిలో పుదీనాతో చర్మం కాంతివంతం.. ఇలా ట్రై చేసి చూడండి..!