
Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే చాలా క్రేజ్ పెరిగింది. ఇంటర్నెట్‌లో చాలా మంది కెమెరా ఆన్ చేసి రీల్స్ చేడడంలో బిజీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ కోతి ముందు రీల్స్ చేసినందుకు తగిన బుద్ది చెప్పింది. కోతి ముందు అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే కోపంతో ఊగిపోయిన కోతి.. అమ్మాయి జుట్టు పట్టుకుని లాగింది. ఎంతకి విడవకపోవడంతో దెబ్బకు పరారైపోయింది ఆ అమ్మాయి. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే కోరికతో, ప్రజలు తరచుగా ఇలాంటి విన్యాసాలు చేస్తుంటారు. చాలా మందికి రీల్స్ పిచ్చి పిక్స్ చేరుకుంటోంది. కానీ ఇలాంటి పిచ్చి చివరకు ప్రమాదం అంచున వరకు తీసుకెళ్తుంది. అందుకే ఇలాంటివే తగ్గించుకుంటే మంచిదని అనే డైలాగ్ సూటవుతుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో అలాంటి ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది.
अब तो जानवर भी परेशान को गए है
इन रीलबाजों से।
यकीन न आए तो वीडियो देखें।
😹😹😹😹😹😹😹 pic.twitter.com/5qR2Yi7wX9— Eshika (@syadvada169665) August 19, 2025
ఇది కూడా చదవండి Indian Currency: 100, 200 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కీలక ఆదేశాలు!
వీడియోలో ఒక అమ్మాయి పైకప్పు మీద డ్యాన్స్ చేస్తూ రీల్ చేస్తున్నట్లు చూడవచ్చు. ఒక కోతి సమీపంలో గోడ మీద కూర్చుని ఉంది. అ కోతిని చూసి ఏ మాత్రం భయపడకుండా ఆ అమ్మాయి డాన్స్ చేస్తూ తెగ పోజులిచ్చింది. ఇది చూసిన కోతి అమ్మాయి జుట్టు పట్టి లాగింది.
ఈ ఫన్నీ వీడియోను @syadvada169665 అనే ఖాతా నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన తర్వాత నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..