Viral Video: పవిత్ర శ్రావణ మాసంలో జరిగే కన్వర్ యాత్రలో శివభక్తుల రద్దీ నెలకొంది. ఎక్కడ చూసినా కేవలం శివభక్తులే కన్వర్లు మోస్తూ కనిపిస్తున్నారు. కన్వర్ యాత్ర అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. దీంతో ఉత్తరాది వారు శ్రావణ మాసం రాగానే కన్వరియాల కన్వర్ యాత్రను చేపడతారు. శివయ్య నామస్మరణతో అన్ని క్షేత్రాలు మారుమ్రోగుతూ ఉంటాయి. భక్తులు కావడితో కన్వర్‌ను చేపడతారు. అయితే భక్తులలో చాలా రకాల కన్వర్లు ఉన్నారు. కొందరు భక్తులు సాధారణ కన్వర్‌తో ప్రయాణిస్తే.. మరికొందరు తమ కన్వర్‌ను పూలతో అలంకరిస్తారు.. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక భక్తుడు అందరికంటే భిన్నమైన కన్వర్‌తో ప్రయాణం చేసాడు. అతడిని చూసిన ప్రజలు కలియుగ (kalyug)’శ్రవణ్ కుమార్’ (Shrvan Kumar) అని అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.
శ్రవణ్ కుమార్ కథ అందరికీ తెలిసిందే.. అంధులైన తన తల్లిదండ్రుల కోరికను తీర్చాలని శ్రవణ కుమారుడు కోరుకున్నాడు. అంధ తల్లిదండ్రులు తీర్థయాత్రలకు తీసుకుని వెళ్లడానికి కావడి తయారు చేసుకున్నాడు. తల్లిదండ్రులను కావడిలో ఇరువైపులా కూర్చోబెట్టుకుని తన భుజం మీద ఆ కావిడిని మోస్తూ.. తీర్ధయాత్రలు చేశాడు. ఇప్పుడు అలాంటి ‘శ్రవణ కుమారుడు’ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కూడా తన వృద్ధ తల్లిదండ్రులతో కన్వర్ యాత్రకు బయలుదేరాడు ఓ భక్తుడు తన తల్లిదండ్రులను కావడిలో ఎత్తుకుని కన్వర్ యాత్రకు ఎలా తీసువెళ్తున్నాడో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ శివభక్తునికి ప్రపంచం సలాం చేస్తోంది.
వీడియో చూడండి:
जहां आजकल बूढ़े मां-बाप का तिरस्कार होता है, उन्हें घर से निकाल दिया जाता है या अपने साथ रहने नहीं दिया जाता.. वहीं आज इसका विपरीत दृश्य देखने को मिला..
लाखों शिवभक्तों के बीच एक श्रवण कुमार भी है जो पालकी में अपने बुज़ुर्ग माता-पिता को लेकर कांवड़ यात्रा पर आया है..
मेरा नमन! pic.twitter.com/phG1h3pfg1
— Ashok Kumar IPS (@AshokKumar_IPS) July 19, 2022
కలియుగ శ్రవణ కుమార్ వీడియోను ఐపిఎస్ అధికారి అశోక్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం చాలా మంది తమ వృద్ధ తల్లిదండ్రులను తృణీకరిస్తున్నారు.. ఇంటి నుండి బయటకు వెళ్లగొడుతున్నారు.. లేదా తమ తల్లిదండ్రులతో నివసించడానికి ఇష్టపడడం లేదు అంటూ కామెంట్ కూడా ఈ వీడియోకు జత చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో అందుకు వ్యతిరేకంగా కనిపిస్తోందని అన్నారు. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రజల హృదయాలను హత్తుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలను చదవడానికి క్లిక్ చేయండి