Watch: వామ్మో.. ఇదేం పిచ్చి తల్లీ..! ఈ మహిళ ఫోన్‌ కేసులో బతికున్న చీమలు..వీడియో చూస్తే అవాక్కే..

|

Aug 10, 2024 | 7:43 PM

ప్రస్తుతం ఒక ఫోన్ కేసు స్టైల్‌కు సంబంధించిన వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందులో ఒక మహిళ ఫోన్ కేస్‌లో చీమల రూపంలో ఉన్న సూక్ష్మజీవులు సజీవంగా కనిపిస్తున్నాయి. ట్రాన్సాపరెంట్‌ కవర్ లోపల ప్రత్యేక ఏర్పాటులో యద్ధేచ్చగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Watch: వామ్మో.. ఇదేం పిచ్చి తల్లీ..! ఈ మహిళ ఫోన్‌ కేసులో బతికున్న చీమలు..వీడియో చూస్తే అవాక్కే..
Live Ants As Phone Case
Follow us on

స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్టైలిష్ ఫోన్ కేసులు ఇప్పుడు కొత్త స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారుతున్నాయి. ఈ రోజుల్లో ఫోన్ కేసులు చాలా అందంగా, విభిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ కేస్ వారి వ్యక్తిత్వానికి సరిపోలాలని, ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. మీరు చాలా మంది ప్రముఖుల ప్రత్యేకమైన ఫోన్ కేసులను చూసి ఉంటారు. అలాంటి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఒక ఫోన్ కేసు స్టైల్‌కు సంబంధించిన వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందులో ఒక మహిళ ఫోన్ కేస్‌లో చీమల రూపంలో ఉన్న సూక్ష్మజీవులు సజీవంగా కనిపిస్తున్నాయి. ట్రాన్సాపరెంట్‌ కవర్ లోపల ప్రత్యేక ఏర్పాటులో యద్ధేచ్చగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్‌ అవుతున్న ఫోన్ కేస్ వీడియో ప్రజల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందులో ఒక మహిళ ఫోన్ కేస్‌లో చీమల రూపంలో సూక్ష్మజీవులు కనిపిస్తున్నాయి. అలాంటి జుగుస్పాకరమైన పురుగులను ఫోన్‌లో పెట్టుకుని ఆ మహిళ హాయిగా తన దైనందిన జీవితాన్ని గడుపుతున్నట్లు వీడియోలో చూపించారు. తెల్లటి స్లీవ్‌లెస్ టాప్,జీన్స్ ధరించిన ఒక మహిళ బెంచ్‌పై కూర్చుని తన స్మార్ట్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా వీడియో క్లిప్ స్టార్ట్‌ అవుతుంది. కెమెరా జూమ్ చేసినప్పుడు ఆమె ఐఫోన్ కవర్‌లో చీమలు కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆమె తన ఫోన్ కేసు వెనకాల చీమలను పెంచుతున్నట్టుగా చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ల సార్లు వీక్షించిన ఈ వీడియోపై పెటా కూడా స్పందించింది. చీమలు బతికి ఉంటే అది నిజంగా బాధకరమైన విషయం అంటూ PETA రాసింది. చాలా మంది వ్యక్తులు కూడా మహిళ ఫోన్‌ కేస్ విషయంలో తీవ్రంగా స్పందించారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి జంతువులను వేధించవద్దని కొందరు సూచించారు. చీమలను పెంచడానికి మరేదైన ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..