
వీధికుక్కల భయానక వాతావరణం మధ్య, సోషల్ మీడియాలో ఒక సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిని చూసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వైరల్ ఫుటేజ్‌లో మొదట ఒక వీధికుక్క ఆవుపై దాడి చేసింది. అంతలోనే ఓ వ్యక్తి అటు నుంచి స్కూటర్‌పై వెళ్తున్నాడు. కుక్క ఆవును కరిచిన దృశ్యాన్ని చూసిన ఆ వ్యక్తి కర్రతో కుక్కను కొట్టాడు. వెంటనే కుక్క పడిపోయింది. ఈ సీన్‌ను చూసిన మరో వ్యక్తి అక్కడికి హడావుడిగా చేరుకుని కుక్కను ఎందుకు కొట్టావని ఈ స్కటర్‌పై ఉన్న వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దదైపోయింది. ఇక ఇదిలా ఉంటే పడిపోయిన కుక్క లేచి స్కూటరిస్ట్‌తో గొడవకు దిగిన వ్యక్తిని కాటేసింది.
A dog bites a cow, cow lover knocks it out, dog lover argues, dog wakes up and bites the dog lover. Street drama at its finest.😬☠️🫠https://t.co/1V7xg6owDP
— Bulla👺 (@Bulla724) August 9, 2025
ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లలో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు కొంతమంది ఆవు రక్షకుడికి మద్దతు ఇస్తుండగా, మరోవైపు కుక్క ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు ఈ సంఘటనను విమర్శిస్తున్నారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే కుక్కను కొట్టినందుకు కుక్క తరపున గొడవకు దిగిన వ్యక్తినే కాటేసింది కుక్క. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని సమయాల్లో అవసరం లేని విషయాల్లో దాలదూర్చితే ఇలా ఉంటుంది. పాపం ఆ వ్యక్తి కుక్క తరపున గొడవకు దిగితే చివరకు ఆయనపైనే దాడి చేసింది. అందుకే గాలికిపోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఇది కూడా చదవండి: Stag Beetle: ఈ కీటకం రూ. 75 లక్షలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాకవుతారు!
ఇది కూడా చదవండి: Telangana: 18 ఏళ్లు నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 13 వరకు అవకాశం!
మరిన్ని ట్రెండ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి