Watch Video: కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..! ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతున్న వీడియో

|

May 09, 2024 | 1:01 PM

అసలే విదేశాల్లో ఆటో రిక్షా కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా కాలిఫోర్నియాలో రోడ్డుపై ఆటో కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోయారు. అవును, ఇటీవల కాలిఫోర్నియా రోడ్లపై నలుపు, పసుపు రంగులతో కూడి ఆటో నడుపుతున్నట్లు చూసిన ప్రజలు సోషల్ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు.

Watch Video: కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..! ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతున్న వీడియో
Indian Auto In California
Follow us on

మన భారతదేశ రోడ్లపై నడుస్తున్న ఆటో కాలిఫోర్నియాలో కనిపించినప్పుడు.. ప్రజలు అవాక్కయ్యారు. షాక్‌తో నోరెళ్లబెట్టి అలాగే చూస్తుండిపోయారు. ఆ మరుక్షణంలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలో ఆటో నడపటం ఏంటని సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వీడియోకు 30,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. మనోహర్ సింగ్ రావత్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు వీడియోను షేర్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆటోలు లేకుండా భారతీయ రోడ్లను ఊహించలేం. లక్షలాది మందికి ఇది అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గం. అంతేకాకుండా రద్దీ ప్రదేశాల నుండి త్వరగా బయటపడేందుకు, పేదవాడి కారుగా భావించి ఎక్కువ మంది ఆటోలోనే ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా ముంబై వంటి ఆర్థిక రాజధాని వీధుల్లో ట్రాఫిక్‌ను నివారించడానికి ప్రముఖులు కూడా ఆటోలను తీసుకోవడానికి వెనుకాడరు. ఈ ఆటో ఇప్పుడు ఇండియాతో పాటు కాలిఫోర్నియాలో కూడా కనిపిస్తుంది. అసలే విదేశాల్లో ఆటో రిక్షా కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా కాలిఫోర్నియాలో రోడ్డుపై ఆటో కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోయారు. అవును, ఇటీవల కాలిఫోర్నియా రోడ్లపై నలుపు, పసుపు రంగులతో కూడి ఆటో నడుపుతున్నట్లు చూసిన ప్రజలు సోషల్ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీనికి క్యాప్షన్లో ఇలా వ్రాశారు.. కాలిఫోర్నియాలో రోడ్లపై ఆటో రిక్షా. కభీ ఖుషీ కభీ గమ్ చిత్రంలోని ఒక పాట కూడా #ఆర్టిసియా నేపథ్యంలో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత ఇరు దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థపై పెద్ద చర్చ మొదలైంది. ‘యుఎస్‌లో పబ్లిక్ ట్రాన్సిట్ చాలా అవసరం!!’ భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఓ భారతీయ ప్రవాసుడు ఈ డిమాండ్‌ను లేవనెత్తాడు. మరికొందరు ఆటోను ఆర్టీసియాలో, ఇతర ప్రాంతాల్లో చూసినట్లు గుర్తించారు. అక్కడ చూశాం, ఇక్కడ చూశాం అంటూ పలు వ్యాఖ్యలు కూడా వీడియో కింద రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..