Viral Video: జస్ట్ మిస్.. ఇసొంటి ఆక్సిడెంట్‌ను మీరు ఎప్పుడూ చూసి ఉండరు!.. సోషల్ మీడియలో వీడియో వైరల్
ఈ రోజుల్లో ఇంటి నుంచి వెళ్లిన మనిషి క్షేమంగా తిరిగి వస్తాడో లేదో తెలియిని పరిస్థితి నెలకొంది. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అన్నట్లు రోడ్డు మీద మనం జాగ్రత్తగా లేకున్నా, ఎదుటి వాడు అజాగ్రత్తగా ఉన్నా...

ఈ రోజుల్లో ఇంటి నుంచి వెళ్లిన మనిషి క్షేమంగా తిరిగి వస్తాడో లేదో తెలియిని పరిస్థితి నెలకొంది. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అన్నట్లు రోడ్డు మీద మనం జాగ్రత్తగా లేకున్నా, ఎదుటి వాడు అజాగ్రత్తగా ఉన్నా మనకే బొక్క. అందుకే రోడ్డుపైకి ఎక్కినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పెద్దవారు చెబుతుంటారు. మీరు సరిగ్గా డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ, ముందు లేదా వెనుక ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఢీకొట్టడం చాలా సార్లు జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతుంటుంది. అటువంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఈ వీడియోలో ఒక ఇ-రిక్షా, రెండు రిక్షాల మధ్య ఢీకొనడం కనిపిస్తుంది. ఒక బైక్ రైడర్ రోడ్డు పక్కన నిలబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఈలోగా వెనుక నుండి వస్తున్న ఇ-రిక్షా అకస్మాత్తుగా అదుపు తప్పి ముందు నుండి వస్తున్న రిక్షాను ఢీకొట్టింది. అప్పుడు ముందు నుండి వస్తున్న మరో రిక్షా దానిని ఢీకొంటుంది. ఈ ప్రమాదంలో మూడు రిక్షాల్లోని ప్రయాణికులు కిందపడతారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో రిక్షా డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. కానీ, ఇ-రిక్షాలో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి నేలపై పడి లేవలేకపోతాడు.
వీడియో చూడండి:
इतना उच्च कोटि का एक्सीडेंट आपने कभी नहीं देखा होगा..,😜😂 pic.twitter.com/yYKuUOk9W9
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) August 19, 2025
వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ విభిన్నంగా ప్రతిస్పందింస్తున్నారు. ఒక వినియోగదారు ‘ఢిల్లీలో ఈ-రిక్షా డ్రైవర్లు భయాన్ని సృష్టించారు’ అని రాశారు, మరొక వినియోగదారు సరదాగా ‘యమ ధర్మరాజు వారి పేర్లు రాసేటప్పుడు పెన్నులో ఇంకు ఆయిపోయినట్లుంది అని రాశారు. అదేవిధంగా, ఒక వినియోగదారు ‘ఈ-రిక్షా డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా పడుకున్నాడు. అతను చాలా హాయిగా పడిపోయాడు. వీడియోను జాగ్రత్తగా చూడండి’ అని రాశారు, మరొకరు ‘ఎవరి నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో నిర్ణయించడం కష్టం’ అని రాశారు.
