Wood Sorrel Plant: ఈ మొక్కకాదు మిస్సైల్.. తనని టచ్ చేసినవారిపై విత్తనాలతో దాడి చేస్తుంది.. వీడియో వైరల్

Wood Sorrel Plant: ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి.  సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎవరికీ ఏ వింత కనిపించినా వెంటనే దానికి సంబంధించిన వీడియోతో కూడిన విశేషాలను..

Wood Sorrel Plant: ఈ మొక్కకాదు మిస్సైల్.. తనని టచ్ చేసినవారిపై విత్తనాలతో దాడి చేస్తుంది.. వీడియో వైరల్
Wood Sorrel Plant

Updated on: Mar 03, 2022 | 9:25 AM

Wood Sorrel Plant: ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి.  సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎవరికీ ఏ వింత కనిపించినా వెంటనే దానికి సంబంధించిన వీడియోతో కూడిన విశేషాలను వెంటనే షేర్ చేస్తున్నారు. పదిమందితో పంచుకుంటున్నారు. కొన్నింటిని చూస్తే ఫన్నీగా అనిపించి నవ్వుకుంటే.. మరికొన్ని ఔరా అనిపించేలా ఉంటూ.. అబ్బురపరుస్తాయి. తాజాగా ప్రకృతిలో ఓ వింత వీడియో వైరల్(Viral Video) అవుతుంది. మనుషులు తమ మీద ఎవరైనా దాడి చేస్తే.. రక్షించుకోవడానికి ఎలా తిరగబడతారో.. తెలిసిందే. అంతేకాదు .. యుద్ధం వస్తే.. ఏ విధంగా క్షిపణుల వర్షం కురిపిస్తారో.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్జం చూస్తూనే ఉన్నాం.. అయితే మనుషులను యుద్ధం చేయడానికి  ఆయుధాలను వాడుతుంటే.. జంతువులు తమ కోరలు, గోళ్లవంటి వంటిని వాడతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే మొక్కలు కూడా తమ జోలికి వచ్చిన వారిపై దాడి చేస్తాయని తెలుసా..?

ఇప్పటి వరకూ మనిషి నరికితే నరికించుకునే చెట్లు.. పండ్లు, పువ్వులు కొస్తే.. నోరుమూసుకుని మనిషికి తమ ఫలాలను ఇచ్చే చెట్ల గురించి తెలుసు.. అయితే కొన్ని మొక్కలు తమను తాము రక్షించుకోవడం ఇతర సూక్ష్మక్రిములను తింటాయని.. మాంసాహార మొక్కలున్నాయని తెలుసు.. కానీ ఈరోజు తమ శత్రువు మీద క్షిపణులను ప్రయోగించే మొక్కల గురించి తెలుసుకుందాం..

వుడ్ సోరెల్ అనే మొక్కకు చెందిన ఓ వీడియో ఒకటి  ఒడిశాకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ వుడ్ సోరెల్ మొక్క బుల్లెట్స్ ను పిలుస్తుంది. తనను ఎవరైనా టచ్ చేస్తే.. వెంటనే ఆ మొక్కలకు కోపం వస్తుంది. అలా టచ్ చేసిన వారి బారినుంచి తనను తాను కాపాడుకోవడం కోసం వెంటనే మిస్సైళ్లను పేల్చుతుంది.  అంటే తన విత్తనాలను ఎదుటివారిమీదకు విసిరేస్తుంది. వుడ్ సోరెల్ మొక్క కాయలు.. చూడడానికి అచ్చం బెండకాయల్లా ఉంటాయి. ఎవరైనా ఆ మొక్కను తాకితే.. వెంటనే విత్తనాలను విసురుతుంది.. అలా ఒకదాని తర్వాత ఒకటి..  టప టప మని.. ఎదుటివారి మీదకు వదులుతూనే ఉంటుంది.  ఇలా తన విత్తనాలను దాదాపు నాలుగు మీటర్ల వరకు విసరగలదని తెలుస్తోనేది. అయితే ఈ విత్తనాల వలన మనుషులకు హాని జరగదు కానీ.. ఆ మొక్క సమీపంలోకి వెళ్లే చిన్న చిన్న కీటకాలకు మాత్రం ఈ విత్తనాలు తగిలితే.. తీవ్రంగా బాధకు లోనవుతాయి. ప్రసుత్తం ఈ వుడ్ సోరెల్  మొక్క వైరల్‌ అవుతోంది.

Also Read:

ఈ పిల్లి మహా ముదురు.. నచ్చని టీవీ ఛానల్ పెడితే ఏం చేస్తుందో మీరే చూడండి..